HOME »NEWS »MOVIE »pawan kalyan and krish movie officially announced sr

PSPK27: క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. అధికారిక ప్రకటన..

PSPK27: క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. అధికారిక ప్రకటన..
క్రిష్ దర్శకత్వలో పవన్ కళ్యాణ్ Photo : Twitter

Pawan Kalyan : క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

  • Share this:
    పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. అక్కడ అమితాబ్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాతో పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడితో వస్తోన్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. కాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా చూపించకుండా.. ఎరుపు రంగు కండువాతో అదరగొడుతున్నాడు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ యం రత్నం నిర్మిస్తున్నాడు.

    క్రిష్, పవన్ కళ్యాణ్, రత్నం Photo : Twitter





    ఇక కథ విషయానికి వస్తే రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు వీర అని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక్కడ మరో విశేషం ఏమంటే ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ పీరియాడిక్ మూవీలో బాలీవుడ్ భామ జాక్వీలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
    Published by:Suresh Rachamalla
    First published:September 02, 2020, 13:04 IST