మరోసారి కలుసుకున్న పవన్ కళ్యాన్, త్రివిక్రమ్.. దాని కోసమే..

పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ ఆత్మీయ కలయిక (Twitter/Photo)

అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి కలుసుకున్నారు. వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వివరాల్లోకి వెళితే..

  • Share this:
అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి కలుసుకున్నారు. వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వివరాల్లోకి వెళితే.. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్.. తన దృష్టిని పూర్తి స్థాయిలో రాజకీయాలపైనే కేటాయించాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయినా... మొక్కవోని దీక్షతో రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు పనవ్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీలో  మరో నాలుగున్నరేళ్ల వరకు ఎన్నికలు లేకపోవడంతో ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అది కూడా సామాజిక నేపథ్యంలో ఉన్న కథాంశాలే చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ కోవలోనే హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను ముఖ్యపాత్రలో నటించి సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

pawan kalyan,trivikram srinivas,pawan kalyan trivikram,pawan kalyan trivikram pink remake,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,trivikram twitter,trivikram instagram,trivikram facebook,trivikram dialogues,pawan kalyan,pawan kalyan pink remake,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan krish movie,balakrishna krish pawan kalyan,balakrishna twitter,balakrishna instagram,balakrishna facebook,pawan kalyan movies,krish,director krish,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan and krish movie news,pawan kalyan videos,director krish about pawan kalyan,pawan kalyan 25,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan in krish marriage,pawan kalyan new movie,pawan kalyan next movie,krish wants to direct pawan kalyan,pawan,pawan kalyan tv show,pawan kalyan fans,pawan kalyan,pawan kalyan speech,pawan kalyan janasena,pawan kalyan about,pawan kalyan updates,pawan kalyan news today,pawan kalyan news,pawan kalyan craze,pawan kalyan voice,roja on pawan kalyan,pawan kalyan latest,roja vs pawan kalyan,pawan kalyan movies,pawan kalyan meeting,kcr about pawan kalyan,pawan kalyan son akira,pawan kalyan back pain,power star pawan kalyan,pawan kalyan jsp latest,పవన్ కళ్యాణ్,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,జనసేన పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేనాని పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రిష్,పవన్ కళ్యాణ్ క్రిష్ బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్,పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ సినిమాకు డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్,
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్


ఈ చిత్రానికి త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్‌ను కలిసి ఈ సినిమా ఔట్‌పుట్ మరింత బాగా వచ్చే విధంగా త్రివిక్రమ్ తీర్చిదిద్దనున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడుగా మారాకా.. వేరే ఇతర సినిమాలకు మాటలు రాయడం మానేసారు. కానీ పవన్ కళ్యాణ్ నటించిన ‘తీన్‌మార్’ సినిమాకు అప్పట్లో మాటలు అందించారు. మళ్లీ చాలా ఏళ్లకు పవన్ కళ్యాణ్‌ సినిమా ‘పింక్’ రీమేక్ ‘లాయర్ సాబ్’ చిత్రానికి మాటలు,స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. మరోవైపు పవన్ ‌తో త్రివిక్రమ్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్..  క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. వీటితో అపుడెపుడో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’ చిత్రాన్ని దుమ్ము దులిపే పనిలో పడ్డాడు పవన్. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఆయన అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 10న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నట్టు ప్రచారం జరగుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published: