హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan Mahesh Babu: మ‌హేష్ ఫ్యామిలీకి గిఫ్ట్.. ప‌వ‌న్ దంప‌తుల‌కు థ్యాంక్స్ చెప్పిన న‌మ్ర‌త శిరోద్క‌ర్

Pawan Kalyan Mahesh Babu: మ‌హేష్ ఫ్యామిలీకి గిఫ్ట్.. ప‌వ‌న్ దంప‌తుల‌కు థ్యాంక్స్ చెప్పిన న‌మ్ర‌త శిరోద్క‌ర్

పవన్ కల్యాణ్ మహేష్ బాబు నమ్రత

పవన్ కల్యాణ్ మహేష్ బాబు నమ్రత

టాలీవుడ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ ఇంట క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను(Christmas Celebrations) ప్రారంభించారు. ఇక క్రిస్మ‌స్ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan), అన్నా లెజినోవా దంప‌తులు ప‌లువురికి గిఫ్ట్‌లు పంపారు.

ఇంకా చదవండి ...

Pawan Kalyan Christmas Gift: టాలీవుడ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ ఇంట క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ప్రారంభించారు. ఇక క్రిస్మ‌స్ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, అన్నా లెజినోవా దంప‌తులు ప‌లువురికి గిఫ్ట్‌లు పంపారు. ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కుటుంబానికి ప‌వ‌ర్‌స్టార్ పంపిన గిఫ్ట్ అందింది. ఈ విష‌యాన్ని న‌మ‌త్ర శిరోద్క‌ర్ త‌న సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఈ ప‌విత్ర మాసంలో మీకంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా. అన్నా, క‌ల్యాణ్‌ల‌కు మెర్రీ క్రిస్మ‌స్ అని కామెంట్ పెట్టారు. అలాగే ప‌వ‌న్ పంపిన గిఫ్ట్ ఫొటోను కూడా న‌మ్ర‌త షేర్ చేసుకున్నారు. కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబు మంచి స్నేహితులు అన్న విష‌యం తెలిసిందే. బ‌య‌ట ఈ ఇద్ద‌రు ఎక్కువ‌గా క‌నిపించ‌న‌ప్ప‌టికీ.. ఒక‌రి ప‌ట్ల మ‌రొకరు మంచి గౌర‌వాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక ఈ ఇద్ద‌రు క‌లిసి ఒక్క సినిమాలోనైనా న‌టించాల‌ని ఇద్ద‌రి ఫ్యాన్స్ కూడా ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ కల్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌కీల్ సాబ్ మూవీలో న‌టిస్తున్నారు ప‌వ‌న్‌. బాలీవుడ్‌లో మంచి విజ‌యం సాధించిన పింక్ రీమేక్‌గా ఇది తెర‌కెక్కుతోంది. ఈ మూవీ త‌రువాత అయ్య‌ప్ప‌నమ్ కోషియ‌మ్ రీమేక్‌లో, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీలో, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మూవీలో న‌టించ‌నున్నారు ప‌వ‌న్‌. వీటితో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోనూ న‌టించ‌నున్నారు.


మ‌రోవైపు ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రుతో మరో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న మ‌హేష్ బాబు.. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. ఇందులో మ‌హేష్ డ‌బుల్ యాక్ష‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి అమెరికాలో ప్రారంభం కానుంది.

First published:

Tags: Mahesh babu, Namratha Shirodkar, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు