హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాకుండా తెలుగులో రీమేక్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవే..

Pawan Kalyan - Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాకుండా తెలుగులో రీమేక్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవే..

ఫస్ట్ హాఫ్‌లో మూడు.. సెకండాఫ్‌లో రెండు ఫైట్ సీక్వెన్సులు కనిపించబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఫైట్‌తోనే ఉంటుందని.. ఓ ఇంట్లో రౌడీ చేరి సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో వివేకానందుడి ఫోటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫోటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందని.. అది పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో మూడు.. సెకండాఫ్‌లో రెండు ఫైట్ సీక్వెన్సులు కనిపించబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఫైట్‌తోనే ఉంటుందని.. ఓ ఇంట్లో రౌడీ చేరి సామాన్లన్నీ విసిరేస్తూ ఉంటాడు.. ఈ క్రమంలో వివేకానందుడి ఫోటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫోటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందని.. అది పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది.

Pawan Kalyan - Amitabh Bachchan | ఏ సినిమా హిట్టైనా... దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేయటానికి హీరోలు, దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిట్టైన ‘పింక్’ సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి బిగ్‌బీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు

ఇంకా చదవండి ...

రీమేక్... ఈ పదం ఇప్పుడు భలే క్రేజీగా మారిపోయింది. ఏ సినిమా హిట్టైనా... దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేయటానికి హీరోలు, దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిట్టైన ‘పింక్’ సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి బిగ్‌బీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బిగ్ బీ అమితాబ్‌కి రీమేకుల విషయంలో ఓ ప్రత్యేకత వుంది. ఆగండాగండి.... ఆయన అందరికంటే ఎక్కువ రీమేకులు చేశాడనుకోకండి.  ఆయన సినిమాలే ...రికార్డు స్థాయిలో రీమేకులుగా మారాయి.

ముందుగా ‘జంజీర్’ ఈ సినిమా పేరు చెబితే అమితాబ్ అభిమానులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు ఎవరికైనా ఆసక్తి కట్టలు తెంచుకుంటుంది. అంత పెద్ద ఆల్ టైం హిట్ ‘జంజీర్’. ఐతే..‘జంజీర్’ తెలుగులోనూ మంచి మెమరబుల్ మూవీ. ఎందుకంటే, దాన్ని తెలుగు వారి నటరత్నం... ఎన్టీఆర్ రీమేక్ చేశారు కాబట్టి. ‘జంజీర్’ తెలుగులో ‘నిప్పు లాంటి మనిషి’గా వచ్చింది. ఆ ఎన్నాళ్లాకో రామ్ చరణ్ కూడా ‘జంజీర్’ మూవీని హిందీ, తెలుగుల్లో రీమేక్ చేశాడు. కాని, అమితాబ్ జంజీర్, ఎన్టీఆర్ ‘నిప్పు లాంటి మనిషి’కి కలిసొచ్చిన అదృష్టం... రామ్ చరణ్ తుఫాన్‌కి రాలేదు.

జంజీర్ మూవీ (యూట్యూబ్ క్రెడిట్)

అమితాబ్ సినిమాల్లో ‘లావారిస్’ సినిమాను ఎవ్వరూ మరిచిపోలేరు. బిగ్ బీ బిగ్ హిట్టైన ‘లావారిస్’ మూవీని తెలుగులో మళ్లీ ఎన్టీఆర్ ‘నా దేశం’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల కావడం విశేషం.అమితాబ్ బచ్చన్ ‘దీవార్’ను ఎన్టీఆర్..‘మగాడు’గా రీమేక్ చేసిన సక్సెస్ అందుకున్నాడు.

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ లావారిస్ మూవీని నా దేశంగా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

అమితాబ్ బచ్చన్ సుదీర్ఘ కెరీర్ లో చేసిన మరో మూవీ ‘దో అంజానే’. ఈ సినిమాను వన్స్ ఎగైన్ ఎన్టీఆర్ రీమేక్ చేశారు. ‘దో అంజానే’ తెలుగు వర్షన్ పేరు...‘మా వారి మంచితనం’. ఇక సీనియర్ బచ్చన్ ‘డాన్’ గురించైతే మాట్లాడుకునేదే లేదు. ఇఫ్పటికీ ‘డాన్’ హంగామా బాక్సాఫీస్ వద్ద నడుస్తూనే వుంది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశాడు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశాడు. మళ్లీ దాన్ని అజిత్ సరికొత్తగా అదే టైటిల్‌ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేశాడు. తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. నటరత్న ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా డాన్ సినిమాకి రీమేకే.

యుగంధర్ (యూట్యూబ్ క్రెడిట్)

‘హేరాఫేరి’.. అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్‌లో ఇదొకటి. ఈ అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని హిందీలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా చేశాడు. తెలుగులో నందమూరితో అక్కినేని కలిశారు అందుకే, ‘రామకృష్ణులు’ అన్న టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ స్వీట్ మెమరీ. ఎన్టీఆర్ అండ ఏఎన్నార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా ‘సత్యం శివం’. ఇది కూడా బాలీవుడ్‌లొ అమితాబ్ చేసిన ‘సుహాగ్’ సినిమాకి రీమేకే.

these are qualities between sr ntr and amitabh bachchan,sr ntr,amitabh bachchan,sr ntr amitabh bachchan,jr ntr,rrr,rrr jr ntr,jr ntr twitter,nandamuri taraka ramarao,big b,amitabh bachchan twitter,amitabh bachchan blog,amitabh bachchan instagram,tollywoo,telugu cinema,bollywood,hindi cinema,amitabh bachchan ntr zanjeer nippulanti manishi,big b ntr don yugandhar,అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,ఎన్టీఆర్,ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్.,అమితాబ్ బచ్చన్ రీమేక్ సినిమాలు,ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాలు
బిగ్‌బీ సుహాగ్‌ మూవీని ’సత్యం శివం’గా రీమేక్ చేసిన ఎన్టీఆర్ (Youtube/Credit)

అమితాబ్ సినిమాల్ని సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇష్టంగానే రీమేక్ చేశాడు.ఆయన చేసిన వాటిల్లో తప్పక చెప్పుకోవాల్సింది ‘అందరికంటే మొనగాడు’. ఇదీ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ‘సత్తే పే సత్తా’కి రీమేక్. అలాగా..అమితాబ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటైన ‘అమర్ అక్బర్ ఆంథోని’కి తెలుగు వర్షన్ ‘రామ్ రాబర్ట్ రహీమ్’. దీన్ని కూడా కృష్ణనే రీమేక్ చేశారు. ఇందులో రజినీకాంత్, చంద్రమోహన్ నటించడం విశేషం.

అమర్ అక్బర్ ఆంటోని తెలుగు రీమేక్ రామ్ రాబర్ట్ రహీమ్ (File/Photo)

కృష్ణ హీరోగా నటించిన ‘కుమార్ రాజా’ మూవీ హిందీలో అమితాబ్ ‘మహాన్’గా రీమేక్ చేసాడు. తెలుగులో కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. హిందీలో నేపాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.  కానీ ఈ సినిమాను ముందుగా కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. 1978లో విడుదలైన ఈ సినిమాను కృష్ణ అదే యేడాది ‘కుమార్ రాజా’ గా రీమేక్ చేసి విడుదల చేసారు. మరోవైపు అమితాబ్ ఈ చిత్రాన్ని 1983లో రీమేక్ చేసారు.

కృష్ణ కుమారరాజా హిందీ రీమేక్ మహాన్‌లో అమితాబ్ బచ్చన్ (File/Photo)

అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఇంక్విలాబ్’ కన్నడలో అంబరీష్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’సినిమాకు రీమేక్. ఈ సినిమాను బిగ్‌బీ ‘ఇంక్విలాబ్’గా రీమేక్ చేసి హిట్టు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘ముఖ్యమంత్రి’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.

అమితాబ్ ‘ఇంక్విలాబ్’ తెలుగు రీమేక్ ముఖ్యమంత్రిలో కృష్ణ(file/Photo)

తెలుగులో అమితాబ్ సినిమాల్ని చాలా ఆసక్తిగా రీమేక్ చేసిన హీరో శోభన్ బాబు. చాలా సినిమాలు హిందీ నుంచి ఇక్కడికి తెచ్చిన మన సొగ్గాడు... సక్సెస్ లు కూడా బాగానే కొట్టాడు.‘రోటీ కప్డా ఔర్ మకాన్’ సినిమా ‘జీవన పోరాటం’ అయింది. కానీ ఈ మూవీలో మాత్రం శోభన్ బాబు ...మనోజ్ కుమార్ పాత్రలో నటిస్తే..రజినీకాంత్ బిగ్‌బీ క్యారెక్టర్ చేశారు.ఇక అమితాబ్ నటించిన ‘మజ్బూర్’ ... ‘రాజా’గా రీమేక్ అయింది. ఆ తర్వాత అమితాబ్ నటించిన ‘కస్మే వాదే’ మూవీ తెలుగులో ‘చేసిన బాసలు’గా మారింది. ఇక బిగ్‌బీ నటించిన ‘త్రిశూల్’ కాస్తా ‘మిష్టర్ భరత్’ అయితే, ‘ఖుద్దార్’ మూవీ... ‘డ్రైవర్ బాబు’ సినిమాగా తెలుగు వారి ముందుకు వచ్చింది. మొత్తానికి శోభన్ బాబు, అమితాబ్‌ల కనెక్షన్ బాగానే వర్కౌటైంది.

శోభన్ బాబు రీమేక్ చేసిన అమితాబ్ రీమేక్ సినిమా జీవన పోరాటం (Twitter/Photo)

ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ... వీళ్ల లాంటి హీరోలే కాదు... కొద్దిగా తరువాత ఫీల్డ్ లోకి వచ్చిన హీరోలు, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ వున్న వారూ కూడా అమితాబ్ సినిమాలతో హిట్ కొట్టారు. కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్ బాబు... ఇలా అందరూ ఏదో ఒక దశలో బిగ్ బీ సినిమాలపై కన్నేసిన వారే. అమితాబ్ కీ రోల్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘నమక్ హలాల్’. తెలుగులో ఈ సినిమా ‘భలే రాముడు’ పేరుతో వచ్చి హిట్ కొట్టింది. మోహన్ బాబు అమితాబ్ పాత్ర చేయగా... మరో హీరోగా మురళీ మోహన్ కనిపించారు.

భలే రాముడు, నమక్ హలాల్ (యూట్యూబ్ క్రెడిట్)

అమితాబ్ సినిమాతో ‘భలే రాముడు’ మూవీ అప్పుడే కాదు...మురళీ మోహన్ మరో మారు కూడా లాభపడ్డాడు. ఆయన సీనియర్ బచ్చన్ చేసిన ‘మిలి’ సినిమాని తెలుగులో ‘జ్యోతి’గా రీమేక్ చేశాడు. ఈ మూవీ అప్పట్లో బాగా ఆడింది.బిగ్ బీ సినిమాలపై ఖర్ఛీఫ్ వేసిన ఆనాటి హీరోల్లో కృష్ణంరాజు కూడా వున్నారు. బచ్చన్ సాబ్ చేసిన ‘అదాలత్’ సినిమాని ఆయన ‘శివమెత్తిన సత్యం’ పేరుతో రీమేక్ చేశారు. అంతే కాదు, చిరంజీవితో కలిసి ‘ప్రేమ తరంగాలు’ అనే సినిమా కూడా చేశారు. ఈ సినిమా బాలీవుడ్ మెమరబుల్ మూవీ ‘ముఖద్ధర్ కా సికందర్’ కి రీమేక్.

శివమెత్తిన సత్యం, అదాలత్ (యూట్యూబ్ క్రెడిట్)

అమితాబ్ బచ్చన్ సినిమాలు తెలుగు హీరోలకి తరతరాలు సక్సెస్ ఇస్తూనే వచ్చాయి. అలా బిగ్ బి ఖాతాలో హిట్స్ కొట్టిన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జగపతి బాబు వంటి హీరోలున్నారు.అమితాబ్ ‘ముఖద్ధర్ కా సికందర్’ తెలుగులో ‘ప్రేమ తరంగాలు’గా రీమేకైతే.. అందులో చిరు నటించాడు. అయితే, మెగాస్టార్ మాత్రం  బిగ్ బీ పాత్రలో మాత్రం కనిపించలేదు. అయితే, వెంకీ అమితాబ్ చేసిన ‘నసీబ్’ సినిమాని తెలుగులో చేసి సక్సెస్ కొట్టాడు. ‘త్రిమూర్తులు’ పేరుతో వచ్చిన ఈ రీమేక్‌లో వెంకటేష్’తో పాటూ అర్జున్, రాజేంద్రప్రసాద్‌లు కూడా మనకు కనిపిస్తారు.

అమితాబ్ బచ్చన్ నసీబ్ తెలుగు రీమేక్‌ ‘త్రిమూర్తులు’లో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ (File/Photo)

అమితాబ్ చిత్రాల్ని రీమేక్ చేసుకోటం ఆయన హీరో పాత్రలు చేసినంత వరకే అనుకుంటే పొరపాటు. ఆయన క్యారెక్టర్ రోల్స్ కి వచ్చేశాక కూడా రీమేక్‌ల పరంపర సాగుతూనే వచ్చింది. స్మాల్ బి నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ’ తెలుగులో ‘భలే దొంగలు’గా రీమేకైంది. తరుణ్ అభిషేక్ పాత్రలో కనిపిస్తే అమితాబ్ చేసిన ఇంట్రస్టింగ్ రోల్‌ను జగపతిబాబు చేశాడు.

బంటీ ఔర్ బబ్లీ తెలుగు రీమేక్ ‘భలే దొంగలు’ (File/Photos)

అమితాబ్ డ్యూయెట్స్ పాడే హీరో రోల్స్ మానేశాక చేసిన చిత్రం ‘ఖాకీ’. 2004లో వచ్చిన ఈ సినిమాని టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ రీమేక్ చేశాడు. బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిదేమి లేదు ఈ సినిమా విషయంలో. ‘సత్యమేవ జయతే’ పేరుతో రాజశేఖర్ చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది.

అమితాబ్ ఖాకీ తెలుగు రీమేక్ సత్యమేవ జయతే లో రాజశేఖర్ (file/Photo)

అమితాబ్ బచ్చన్ సినిమాల్ని అఫీషియల్‌గా రీమేక్ చేసిన క్రియేటివ్ పీపుల్ కొందరైతే ... మరి కొందరు ఆయన సినిమాలని చూసి ఇన్ స్పైర్ అయ్యారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు చూసి కొందరు దర్శకులు ప్రేరణ తెచ్చుకుని కొత్త కథలు రాసుకున్నారు. అలా తయారైన అమితాబ్ బచ్చన్ సినిమాలకు రీమేకుల్లాంటి... ఫ్రీమేకులే... ‘ఆజాద్’, ‘భాషా’ చిత్రాలు. నాగార్జున ‘ఆజాద్’ సినిమాకి అమితాబ్.. ‘మై ఆజాద్ హూ’ సినిమా ఆధారం. అలాగే, బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘బాషా’కి... బిగ్ బీ చేసిన ‘హమ్’ సినిమా మూలం.

అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, గోవిందా నటించిన ‘హమ్’ సినిమాను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రజినీకాంత్ ‘భాషా’గా చేసారు.(File/Photo)

చాలా మంది తెలుగు హీరోలు అమితాబ్ సినిమాలు రీమేక్ చేశారు. అలాంటి రీమేక్ లో చిరంజీవి కూడా నటించాడు. కాని, ఎప్పుడూ అమితాబ్ పాత్రలో కనిపించలేదు. బట్... బచ్చన్ సాబ్ చిరు మూవీని మాత్రం బాలీవుడ్ తీసుకెళ్లాడు. ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాని ‘అందా కానూన్’ అంటూ హిందీ ఆడియన్స్ ముందుంచాడు. కానీ ఈ బాలీవుడ్ రీమేక్‌లో చిరు పాత్రలో రజినీకాంత్ నటించడం విశేషం. అంతకంటే ముందు ఈ మూవీ తమిళంలో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కింది.తెలుగు నుంచే కాదు... బిగ్ బీ రీమేక్ చేసిన చిత్రలు తమిళం, కన్నడ నుంచి కూడా వచ్చాయి. కన్నడలో వచ్చిన ‘చక్రవ్యూహ’ సినిమానే బాలీవుడ్‌లో ‘ఇంక్విలాబ్’. ‘అమితాబ్’ పుట్టగానే వాళ్ల తండ్రి పెట్టిన ఒరిజినల్ పేరు కూడా ‘ఇంక్విలాబే’. అలా ఈ మూవీ మంచి హిట్టై ఇంక్విలాబ్ కి... అదేనండీ, అమితాబ్ కి స్వీట్ మెమరీ గా మిగిలిపోయింది. అమితాబ్ తమిళం నుంచి ముంబైకి తీసుకుపోయిన సూపర్ హిట్ మూవీ ‘ఆఖ్రీ రాస్తా’. దీని తమిళ వర్షన్ పేరు ‘ఓరు ఖైదియన్ డైరీ’. కమల్ చేసిన ఈ సినిమాని అదే స్థాయి నటుడైన సీనియర్ బచ్చన్... అద్భుతంగా చేసి సక్సెస్ అందుకున్నాడు.

కమల్ హాసన్ ‘ఖైదీయన్ డైరీ’ హిందీ రీమేక్ ‘ఆఖ్రీ రాస్తా’గా బిగ్‌బీ రీమేక్ (Twitter/Photo)

దాదాపుగా ఎప్పుడూ రీమేక్‌ల జోలికి వెళ్లని బాలకృష్ణ సహజంగానే అమితాబ్ సినిమాలేవీ తెలుగులో చేయలేదు. కాని, బచ్చన్ మాత్రం ఈ ‘ముద్దుల మావయ్య’ని హిందీ వారి వద్దకు తీసుకెళ్లాడు. ఇక్కడి సూపర్ హిట్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ని అక్కడ ‘ఆజ్ కా అర్జున్’గా రీమేక్ చేశాడు.

ముద్దుల మావయ్య, ఆజ్ కా అర్జున్ (ఫేస్ బుక్)

ఇక వెంకీ హిట్ సినిమాకి కూడా అమితాబ్ రీమేక్ చేశాడు. ఆ సినిమానే ‘సూర్య వంశం’. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై హిట్టైనప్పటికీ.... హిందీలో నిరాశపరిచింది. అస్సలు అంతకంటే ముందు తమిళంలోనూ శరత్ కుమార్ చేసిన ‘సూర్యవంశం’ సూపర్ హిట్. కాని, బిగ్ బీకి మాత్రం బిగ్ బెనిఫిట్ ఇవ్వలేదు.

సూర్య వంశం హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)

తెలుగులోకి రాకుండా వేరే భాషల్లోకి వెళ్లిపోయిన అమితాబ్ గ్రేట్ మూవీస్ లో ఒకటి ‘మర్ద్’. దీన్ని తమిళంలో ‘మా వీరన్’ అంటూ రజినీకాంత్ రీమేక్ చేశాడు. మన తెలుగు హీరోలెవరూ ‘మర్ద్’ మూవీని టేకప్ చేయలేదు. అలాగే, ‘షరాబీ’ లాంటి మెమరబుల్ మూవీ కూడా తెలుగు వారు మిస్ అవ్వాల్సి వచ్చింది. తెలుగులో ఏ హీరో చేయని ‘షరాబీ’ మూవీని కన్నడంలో విష్ణువర్ధన్ చేశారు. అక్కడ ‘షరాబీ’ పేరు ‘నీ తండ తనికే!’ ఆ టైటిల్ కి అర్థమేంటో గాని... అమితాబ్ చిత్రాల రీమేక్ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోకి జరిగిందని మాత్రం మనకు అర్థమవుతోంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ ‘పింక్’ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ తమిళంలో అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వాయి’గా రీమేక్ అయి సూపర్ హిట్టైయింది.  ఏమైనా ఒక హీరో నటించిన ఇన్ని సినిమాలు వేరే భాషల్లో రీమేక్ కావడం అనేది అది ఒక్క అమితాబ్ బచ్చన్ విషయంలోనే సాధ్యమైంది.

First published:

Tags: Amitabh bachchan, Bollywood news, Krishna, Krishnam Raju, NTR, Pawan kalyan, Pink, Tollywood, Vakeel Saab

ఉత్తమ కథలు