ఆ కుర్ర దర్శకుడి కెరీర్‌తో ఆడుకుంటున్న మెగా హీరోలు..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరికీ మెగా హీరోలతో పని చేయాలని ఉంటుంది. ఆ కుటుంబంలోని ఒక్క హీరోతో చేసినా కూడా అందరితోనూ పని చేసే అవకాశం వస్తుంది. ఈ తరం దర్శకుల్లో హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 8:03 PM IST
ఆ కుర్ర దర్శకుడి కెరీర్‌తో ఆడుకుంటున్న మెగా హీరోలు..
పవన్ కల్యాణ్ ఎన్నికల సభలో అల్లు అర్జున్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరికీ మెగా హీరోలతో పని చేయాలని ఉంటుంది. ఆ కుటుంబంలోని ఒక్క హీరోతో చేసినా కూడా అందరితోనూ పని చేసే అవకాశం వస్తుంది. ఈ తరం దర్శకుల్లో హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులకు మెగా ఆఫర్ వర్కవుట్ అయింది. ఒక్క హీరోతో మొదలుపెట్టి అందర్ని పట్టేయొచ్చు. అందుకే మెగా కంపౌండ్‌లోకి వెళ్లడానికి దర్శకులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కుర్ర దర్శకుడి కెరీర్‌తో మాత్రం పవన్ కల్యాణ్, బన్నీ ఆడుకుంటున్నారు. అతడే వేణు శ్రీరామ్. ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఎంసిఏ సినిమాతో హిట్ కొట్టాడు. తొలి సినిమాకు రెండో సినిమాకు దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
Pawan Kalyan Allu Arjun playing games with MCA movie Director Venu Sriram career pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరికీ మెగా హీరోలతో పని చేయాలని ఉంటుంది. ఆ కుటుంబంలోని ఒక్క హీరోతో చేసినా కూడా అందరితోనూ పని చేసే అవకాశం వస్తుంది. ఈ తరం దర్శకుల్లో హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి.. pawan kalyan,pawan kalyan venu sriram,allu arjun venu sriram,venu sriram icon movie,allu arjun icon movie,trivikram srinivas,pawan kalyan trivikram,pawan kalyan trivikram pink remake,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,trivikram twitter,trivikram instagram,trivikram facebook,trivikram dialogues,pawan kalyan,pawan kalyan pink remake,pink remake pawan kalyan,pawan kalyan dil raju,jansenani,janasenani pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,వేణు శ్రీరామ్,మెగా హీరోలు పవన్ కల్యాణ్,అల్లు అర్జున్ వేణు శ్రీరామ్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ వేణు శ్రీరామ్,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ బన్నీ

ఇప్పుడు మూడో సినిమా కోసం అంతే గ్యాప్ తప్పేలా కనిపించడం లేదు. అప్పట్లో రవితేజతో ఎవడో ఒకడు సినిమా మొదలుపెట్టి ఆపేసిన వేణు.. ఎంసిఏ వర్కవుట్ చేసాడు. ఇక బన్నీ హీరోగా ఐకాన్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేసాడు కానీ ఈ సినిమా కూడా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. అంతలోనే పవన్ కల్యాణ్ ఛాన్సిచ్చాడు అంటూ వార్తలొచ్చాయి. ఈయన రీ ఎంట్రీ సినిమా పింక్ రీమేక్ దర్శకుడు వేణు శ్రీరామ్ అంటూ న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు పవన్ తీరు చూస్తుంటే అసలు సినిమాలు చేస్తాడా లేదా అన్నట్లుంది. దాంతో వేణు శ్రీరామ్ కెరీర్ ఎటువైపు వెళ్తుందో తెలియని సందిగ్ధంలో పడిపోయింది. మొత్తానికి మెగా హీరోలను నమ్ముకుని ఈ దర్శకుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: November 14, 2019, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading