Agnyaathavaasi: బాలీవుడ్‌కు ‘అజ్ఞాతవాసి’ పయనం.. రీమేక్ అవుతున్న పవన్ డిజాస్టర్ సినిమా..

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి (Pawan Kalyan)

Agnyaathavaasi: ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళమంతా ఫలితాన్ని అందుకుంది అజ్ఙాతవాసి. 50 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. 2018 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

  • Share this:
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆల్ టైమ్ డిజాస్టర్ లేదంటే మరో మాట లేకుండా.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరూ చెప్పే సమాధానం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళమంతా ఫలితాన్ని అందుకుంది. 50 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది అజ్ఞాతవాసి. 2018 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలాంటి సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ వర్షన్‌ రీమేక్ పనులు కూడా మొదలైపోయాయి. నమ్మడం కాస్త కష్టంగానే ఉన్న ఇదే నిజం. అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయినపుడు కూడా అభిమానులు అంతగా బాధ పడలేదు కానీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ సినిమాను హాలీవుడ్ మూవీ లార్గో వించ్ నుంచి త్రివిక్రమ్ కాపీ చేసాడనే విమర్శలే ఫ్యాన్స్‌ను బాధ పెట్టాయి. నిజానికి లార్గో వించ్ హాలీవుడ్‌లోనే యావరేజ్. ఆ సినిమా నుంచి స్పూర్తి పొంది అజ్ఞాతవాసి కథ రాసుకున్నారు త్రివిక్రమ్.

ఇక సినిమాను చూసిన లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే అజ్ఞాతవాసి తన సినిమాకు కాపీ అని కన్ఫర్మ్ చేసాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా సైతం లార్గో వించ్ కథలాగే ఉందనే విమర్శలు వచ్చాయి.
agnyaathavaasi movie largowinch,largowinch bollywood remake,agnyaathavaasi movie,largo winch movie,largo winch movie story,agnyaathavaasi movie censor talk,which movie agnyaathavaasi copied,agnyaathavaasi latest movie news,agnyaathavaasi is a remake of french movie largo winch,largo winch about agnyaathavaasi,బాలీవుడ్‌లో అజ్ఞాతవాసి రీమేక్,లార్గో వించ్ రీమేక్ బాలీవుడ్ విద్యుత్ జమాల్
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి (Pawan Kalyan)

ఇదిలా ఉంటే ఇప్పుడు లార్గో వించ్ అఫీషియల్ రీమేక్ బాలీవుడ్‌‌లోకి వస్తుంది. తుపాకి విలన్ విద్యుత్ జమ్వాల్ హీరోగా రుస్తోమ్ దర్శకుడు టిను సురేష్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ కథ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: