• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN ALL SET TO PRODUCE A MOVIE WITH MEGA PRINCE VARUN TEJ VERY SOON HERE THE DETAILS PK

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిర్మాణంలో మెగా హీరో.. కాంబినేషన్ అదిరింది..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిర్మాణంలో మెగా హీరో.. కాంబినేషన్ అదిరింది..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో కానీ సినిమా నిర్మాణంపై మాత్రం ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. నటుడిగా వరస సినిమాలు చేస్తున్నా కూడా మంచి క‌థ‌లు..

  • Share this:
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల్లోనే ఉంది. ప‌వ‌ర్ స్టార్‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేదేమో కానీ సినిమా నిర్మాణంపై మాత్రం ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. నటుడిగా వరస సినిమాలు చేస్తున్నా కూడా మంచి క‌థ‌లు దొరికితే చిన్న సినిమాలు నిర్మించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు కాదు.. మూడేళ్ల కిందే తాను నిర్మాత‌గా మారుతున్న‌ట్లు చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాను తన సంస్థలోనే మొదలుపెట్టి ఆ తర్వాత బండ్ల గణేష్‌కు ఇచ్చాడు పవర్ స్టార్. త‌న సినిమాల‌నే కాకుండా చిన్న సినిమాల‌ను కూడా ఎంక‌రేజ్ చేయ‌డ‌మే త‌న ప‌ని అన్నాడు జ‌న‌సేనాని. ఇప్పటికే ఈయన నిర్మాతగా సర్దార్ గబ్బర్ సింగ్, ఛల్ మోహన్ రంగా లాంటి సినిమాలు వచ్చాయి కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ క్రేజీ చిత్రానికి ప‌వ‌న్ శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు తెలుస్తుంది. మెగా హీరోతోనే ఈయన సినిమా చేయబోతున్నాడు. అన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా నిర్మించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. పీకే ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లో అన్న‌య్య గారి అబ్బాయితో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.
pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan producer,pawan kalyan varun tej movie,pawan kalyan ram charan movie,pawan kalyan production house,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ నిర్మాత,పవన్ కళ్యాణ్ నిర్మాణంలో వరుణ్ తేజ్
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ (File)

నిజానికి మూడేళ్ల కిందే రామ్ చరణ్ హీరోగా పవన్ నిర్మాతగా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చింది. తాను రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమా నిర్మించ‌బోతున్నాన‌ని అప్ప‌ట్లో అనౌన్స్ చేసాడు ప‌వ‌ర్ స్టార్. కాక‌పోతే ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో ప‌వ‌న్ బిజీ కావ‌డం.. చ‌ర‌ణ్ కూడా ఇత‌ర సినిమాల‌కు క‌మిట్ కావ‌డంతో ప‌వ‌న్, చ‌ర‌ణ్ సినిమా మూల‌న ప‌డిపోయింది. అయితే ఇన్నేళ్ల త‌ర్వాత మరోసారి బాబాయ్ అబ్బాయి కాంబినేష‌న్ క‌లుస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. కాకపోతే ఇక్కడ అబ్బాయి మారిపోయాడు. రామ్ చరణ్ కాకుండా వరుణ్ తేజ్ సీన్‌లోకి వచ్చాడు. ఈ సినిమాకు పవన్ సన్నిహితుడు డాలీ దర్శకుడు అంటూ ప్రచారం జరుగుతుంది.
pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan producer,pawan kalyan varun tej movie,pawan kalyan ram charan movie,pawan kalyan production house,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ నిర్మాత,పవన్ కళ్యాణ్ నిర్మాణంలో వరుణ్ తేజ్
పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ (Pawan Kalyan Varun Tej)

ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాతో పాటు కొత్త దర్శకుడు కిరణ్‌తో బాక్సర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండూ పూర్తైన తర్వాత పవన్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నాడు. ఏదేమైనా కూడా మెగా హీరోలతో పవన్ నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంటే మాత్రం అంతకంటే అదిరిపోయే వార్త మరోటి ఉండదేమో..? అన్నట్లు ఇప్పుడు పవన్ హీరోగానూ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్, అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. వాటితో పాటే నిర్మాతగా కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు