ఇండస్ట్రీలో ఓ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీలు మరొక హీరో చేసిన దాఖలాలు చాలానే ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన దగ్గర వచ్చిన చాలా కథలను వద్దనడంతో వేరే హీరోలు ఆ స్టోరీలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మహేష్ బాబు యాక్ట్ చేసిన అతడు, పోకిరి సినిమా స్టోరీలు ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరకే వచ్చాయి. ఆయనకు నచ్చకనో.. వేరే సినిమాలకు ఇచ్చిన కమిట్స్‌మెంట్స్ కారణాలు ఏమైతే ఏమి ఆయన ఆయా సినిమాలను చేయలేకపోయాడు. అటు రవితేజకు హీరోగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన ‘ఇడియట్’, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ స్టోరీలు కూడా పవన్ కళ్యాణ్ వద్దన్న తర్వాతే రవితేజ చేసి మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ .. కూడా వేరే హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీలు తాను చేసిన సందర్భాలున్నాయి.

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ (Twitter/Photos)
ఇక నందమూరి నట సింహా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఓ స్టోరీని పవన్ కళ్యాణ్ చేసాడు. ఆ చిత్రమే ’అన్నవరం’. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ సినిమాను ముందుగా పరుచూరి బ్రదర్స్ చూసి బాలకృష్ణకు సెట్ అవుతుందని ఆయనకు ఈ కథ వినిపించారు. ఆయన కూడా ఈ కథ విని ఇంప్రెస్ అయ్యారు. ముద్దుల మావయ్య తర్వాత ఆ స్థాయిలో సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాలో ఉండటంతో ఈ సినిమా చేయాలనుకున్నారు బాలయ్య. ఆ తర్వాత బాలయ్య ఈ సినిమాను తనకున్న వేరే కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయారు.

పవన్ కల్యాణ్ బాలయ్య
ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ కథ పక్కనపెట్టారు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు అబ్బూరి రవి రచనలో తెలుగులో పనన్ కళ్యాణ్ కోసం కొన్ని మార్పులు చేసారు. ఆ తర్వాత దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ హీరోగా ‘అన్నవరం’ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన నాగవల్లి చిత్రాన్ని కూడా మొదట బాలకృష్ణతో చేద్దామనుకున్నారట. కానీ బాలయ్య ఈ స్టోరీ చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాగార్జును సంప్రదిస్తే.. ఆయన వద్దని సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఈ సినిమాను వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తే .. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఒకవేళ బాలయ్య ఈ సినిమా చేసి ఉంటే.. కథ ట్రీట్మెంట్ వేరుగా ఉండేదని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. మరోవైపు రాజశేఖర్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘సింహరాశి’ సినిమాను కూడా ముందుగా బాలయ్యతో తీయాలనుకున్నారు.

బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photos)
ఈ రకంగా బాలయ్య రిజెక్ట్ చేసిన స్టోరీలతో రాజశేఖర్ హిట్టు అందుకుంటే.. పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్‌సాబ్’ సినిమాను ముందుగా దిల్ రాజు .. బాలయ్యతో తెరకెక్కించాలనుకున్నాడు. కానీ బాలకృష్ణ ఈ సినిమా స్టోరీ తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కాదని సున్నితంగా తిరస్కరించాడు. ఇపుడు పవన్ కళ్యాణ్ అదే స్టోరీని ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పవన్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:September 02, 2020, 19:16 IST