పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ‘పింక్’ రీమేక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మించే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. వాటితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు ‘లాయర్ సాబ్’ లేదా ‘వకీల్ సాబ్’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఈ రెండు పేర్లును ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించాడు. ఫైనల్‌గా ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్నదమ్ములుగా డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఇక క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ముందుగా కియారా అద్వానీని హీరోయిన్గా అనుకుంటున్నారు. కానీ కియారా మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేయనని రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం కియారా చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం వీరు అడిగిన డేట్స్‌లో కియారా ఫుల్లు బిజీగా ఉందట. ఆమె ప్లేస్‌లో వాణీ కపూర్‌ను తీసుకున్నట్టు సమాచారం.
తాజాగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా తర్వాత డాలీ (కిషోర్ పార్థసాని), బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో నెక్ట్స్ సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరు పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. త్వరలోనే వీరిద్దరి సినిమాలు కూడా పట్టాలెక్కనున్నాయి. వీళ్లిద్దరి తర్వాత పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. త్రివిక్రమ్‌తో సినిమా అంటే ఆయన తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత కనీసం రెండున్నరేళ్ల తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మాత్రం వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krish, Pawan kalyan, Pink, Sriram Venu, Telugu Cinema, Tollywood