• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN 27 NEW CHANGE WILL BE A BIG TREAT FOR FANS MHN

Pawan Kalyan: పవన్ 27.. ఫ్యాన్స్ కోసం చేసిన ఛేంజ్ ఇదే.. ఇక పూనకాలే

Pawan Kalyan: పవన్ 27.. ఫ్యాన్స్ కోసం చేసిన ఛేంజ్ ఇదే.. ఇక పూనకాలే

Pawan 27 new change will be a big treat for fans

Pawan Kalyan - Malayalam Remake: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో అభిమానుల కోసం ఓ ట్రీట్ ఇవ్వబోతున్నారట. అదేంటో తెలుసుకోవాలంటే...

  • Share this:
    రీ ఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ స్పీడు మామూలుగా లేదు. ఒక వైపు రాజ‌కీయాలు.. మ‌రో వైపు సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేస్తూ వ‌స్తున్నాడు. సినిమా విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాల‌కు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అందులో వ‌కీల్ సాబ్ సినిమా సెట్స్‌పై ఉంది. త‌దుప‌రి సినిమాగా స్టార్ట్ చేసిన క్రిష్ సినిమాను ప‌క్క‌న పెట్టి.. చివ‌ర‌గా అనౌన్స్ చేసిన సాగ‌ర్ చంద్ర సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయిపోయాడు. రీసెంట్‌గానే ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. జ‌న‌వ‌రి మొదటి వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప‌వ‌న్ నెల‌న్న‌ర రోజుల డేట్స్ కేటాయించాడు.

    మ‌ల‌యాళంలో విజ‌యవంత‌మైన అయ్య‌ప్పనుమ్ కోశియమ్ సినిమాకు ఇది రీమేక్. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేర్పులు చేయ‌డం కోసం త్రివిక్ర‌మ్ రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ తెలుగు రీమేక్‌లో ఓ ష్లాఫ్ బ్యాక్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశార‌ట‌. పవ‌న్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా ఈ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళంలోని లేని ఫ్లాష్ బ్యాక్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందో లేదో తెలియ‌డం లేదు.

    ఈ సినిమాలో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తే.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ పాత్ర‌లో రానా ద‌గ్గుబాటి పాత్ర ఉంటుంది. అలాగే సాయిప‌ల్ల‌వి కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు