బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) లేటెస్ట్ మూవీ పఠాన్ (Pathaan). దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో మరోసారి అలరించబోతున్నారు షారుక్. దీంతో ఈ మూవీపై జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. షారుక్ సరసన దీపిక పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ సినిమాను జనవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు.
చిత్రంలోని మొదటిపాట బేషారమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలు వివాదాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదాలు సద్దుమణగక ముందే మరో సాంగ్ వదిలారు పఠాన్ మూవీ మేకర్స్. ఈ మూవీ సెకండ్ సాంగ్ ఎలా ఉంబోతుందనే ఆసక్తి నడుమ హుషారెత్తించే 'జూమే జో పఠాన్' పాట వదిలారు. ఈ పాటలో దీపిక షారుక్ స్టెప్స్ అదుర్స్ అనిపించాయి. దీపిక డ్రెస్సింగ్ స్టైల్ మరోసారి హైలైట్ అయింది. వెస్టర్న్ కల్చర్‌ను తలపిస్తున్న సాంగ్ ట్యూన్ నడుమ దీపికతో కలిసి
ఇరగదీశాడు షారుక్ ఖాన్.
ఈ పాటలో షారుక్ ఖాన్.. ఎప్పటిలాగే స్టిఫ్ బాడీతో రఫ్ లుక్‌లో హంగామా చేయగా.. దీపిక పదుకొనే చాలా గ్లామరస్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రేక్షకులు ఈ పాటను పెద్ద హిట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.
మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ సృష్టించిన వివాదాల గురించి తెలిసిందే. బేషారమ్ రంగ్ పాటకు ఓ పక్క భారీ స్పందన వచ్చినా కూడా.. క్రమంగా వివాదాలు చుట్టుముముట్టాయి. . గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో దీపికా పదుకొనె బికినీ అందాలతో రెచ్చిపోయింది. దీంతో ఈ పాటలోని షారుక్, దీపికల హాట్ నెస్‌పై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. షారుఖ్ తో దీపికా చేసిన రొమాన్స్ వివాదాలకు తావిచ్చింది.
ఈ పాటపై, ఇందులోని రొమాంటిక్ సీన్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తుండగా.. ఇటీవల మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీపికా పదుకొనె ధరించిన కాస్ట్యూమ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ సాంగ్ షూట్ డర్టీ మైండ్ తో చేసినట్లు ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Deepika Padukone, Shah Rukh Khan