హోమ్ /వార్తలు /సినిమా /

Pathaan Movie Review: షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘స్పై’ యాక్షన్ డ్రామా..

Pathaan Movie Review: షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘స్పై’ యాక్షన్ డ్రామా..

‘పఠాన్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘పఠాన్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Pathaan Movie Review: గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ ‘పఠాన్’గా బాక్సాఫీస్ దగ్గర మాయ చేసాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : పఠాన్ (Pathaan)

నటీనటులు : షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణే, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా, ప్రకాష్ బేలావాడి తదితరులు..

ఎడిటర్: ఆరిఫ్ షేక్

సినిమాటోగ్రఫీ: సత్‌చిత్ పౌలోస్

సంగీతం: సంచిత్ బల్‌హారా, అంకిత్ బల్‌హరా

నిర్మాత : యశ్ రాజ్ ఫిల్మ్స్ (ఆదిత్య చోప్రా)

దర్శకత్వం: సిద్ధార్ధ్ ఆనంద్

విడుదల తేది : 25/1/2023

గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి.ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ ‘పఠాన్’గా  ప్రేక్షకులను అలరించాడా ?  కింగ్ ఖాన్‌గా బాలీవుడ్‌లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేేసుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

పఠాన్ సినిమా కథ విషయానికొస్తే.. 2019లో భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలిగిస్తోంది. దీంతో పాకిస్థాన్‌ దేశానికి  చెందిన ఐఎస్ఐ కసితో రగిలిపోతూ ఉంటుంది. దీంతో ‘ఔట్ ఫిట్ X ’ అనే కాంట్రాక్ట్ పై పనిచేసే ప్రైవేట్ టెర్రరిస్ట్ గ్రూపును ఆశ్రయిస్తోంది పాకిస్థాన్. దీనిని జిమ్ (జాన్ అబ్రహం) నాయకుడు. ఇతనో మాజీ ‘రా’ ఏజెంట్. క్లిష్ట సమయంలో తనను దేశం పట్టించుకోకపోవడంతో అతను భారత్ పై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో  అతను రష్యాలోని ‘రక్త‌బీజ్’ అనే బయోవెపన్‌‌ను మన దేశంలోని ప్రధాన నగరాలపై ప్రయోగించాలనుకుంటాడు.  ఈ రక్తబీజ్‌ అనేది స్మాల్‌ఫాక్స్‌‌‌కు  చెందినది. కరోనా కన్నా డేంజరస్.  ఇది ఒకవేళ ఈ బయోవెపన్ ప్రయోగిస్తే దేశంలోని ప్రజలు కొన్ని రోజుల్లో చనిపోతారు.  దేశం మొత్తం నాశనం అవుతోంది. ఈ బయోవెపన్ ప్రయోగించకుండా ఉండాలంటే పాకిస్థాన్‌కు కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలని షరతు పెడతాడు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన అజ్ఞాత  ‘రా‘ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్).. జిమ్‌కు చెందిన ‘ఔట్‌ఫిక్స్’ను దాని అధినేతను అంతం చేసి దేశాన్ని కాపాడాడా లేదా అనేదే పఠాన్ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ ..విషయానికొస్తే.. ఇప్పటి వరకు మనం ఎన్నో జేమ్స్ బాండ్, ఇతర హాలీవుడ్‌లో వచ్చిన స్పై సినిమాలను బేస్ చేసుకొని దానికి మన దేశంలో 2019 ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలిగింపును బేస్ చేసుకొని దాన్ని చుట్టు ఓ చక్కని కథను దేశభక్తిని జోడించి గూఢచారి నేపథ్యంలో ‘పఠాన్’ మూవీ స్టోరీ అల్లుకున్నాడు దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్. ఇక యాక్షన్, మాస్ సినిమాలకు లాజిక్ అడక్కూడదు. అంతకు తగ్గట్టే సిద్ధార్ధ్ ఆనంద్.. ఈ సినిమాలో హీరో, విలన్‌తో చేయించే  అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు లాజిక్ అడక్కూడదు. చూసి ఎంజాయ్  చేయాల్సిందే అన్నట్టు సినిమా మొత్తం ఉంటుంది. ఫస్టాఫ్ ఏదోలా లాగించినా.. సెకండాఫ్‌ను పరుగులు పెట్టించాడు. మాములు చిన్న పాయింట్ చుట్టు కథ అల్లుకొనడం బాగుంది.  అంతేకాదు ఈయన గత చిత్రాలు బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు కూడా యాక్షన్ కమ్ స్పై నేపథ్యంలో తెరకెక్కించాడు. ఇపుడు ‘పఠాన్’ కోసం అదే ఫార్ములాను అప్లై చేసాడు. సినిమాలో కొన్ని సన్నివేశాల ఎలివేషన్ సీన్స్ చూస్తే రాజమౌళి, ప్రశాంత్ నీల్ టేకింగ్ అక్కడక్కడ గుర్తుకు వస్తోంది. జేమ్స్ బాండ్ సినిమా తరహాలోనే ఇందులో కూడా సినిమా ప్రారంభంలోనే హీరో ఇంట్రడక్షన్ ఆపై యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.  గతంలో మనం చూసిన జేమ్స్ బాండ్ సినిమాలు  గుర్తుకు వచ్చాయి. ఇక బాండ్  సినిమాల్లో MI6 హెడ్ తరహా పాత్రను ఇందులో నందిని (డింపుల్ కపాడియా)పాత్రను పెట్డాడు.

ఇక జిమ్ (జాన్ అబ్రహం) పాత్ర మాజీ ‘రా’ ఏజెంట్. ఓ విషయంలో దేశం తనను సరైన విధంగా ఆదుకోలేదనే కసితో వివిధ దేశాల్లో తనలాగే ఉన్న ఏజెంట్స్‌తో ‘ఔట్‌ఫిట్ X’ అనే ప్రైవేటు అనే కంటే కార్పోరేట్ తరహా టెర్రరిస్ట్ గ్రూపును తయారు చేస్తాడు. ఒక దేశం నుంచి సుపారీ తీసుకొని వేరే దేశంపై వార్ చేయడం అనే కాన్సెప్ట్.  ఒక దేశభక్తుడు ఎపుడు దేశానికి తను ఏమిచ్చాడనే చూస్తాడు. కానీ దేశం తనకు ఏమిచ్చిందనేది చూడడు. ఇందులో జాన్ అబ్రహం జిమ్ పాత్రను రెండో తరహా పాత్రగా చూపించాడు దర్శకుడు. దీపికా పదుకొణే (రూబీనా ఖాన్)పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్. మొదట విలన్ గ్యాంగ్‌లో ఉండి ఆ తర్వాత పశ్చాతాపంతో హీరో వైపు నిలబడే క్యారెక్టర్‌. ఇక ఈ సినిమాలో ఓ సీన్‌లో  రష్యాలో ఓ బిల్డింగ్ లాకర్‌లో ఉండే ‘రక్త బీజ్’అనే బయో వెపన్‌ను  షఠాన్‌తో కలిసి రూబీనా ఎలా దొంగించారు. ఆ తర్వాత అది జిమ్ చేతుల్లోకి ఎలా వెళ్లిందనేది కన్విన్సింగ్‌గా చెప్పాడు దర్శకుడు. కానీ ఓ దేశానికి చెందిన అత్యంత సెక్యూరిటీగా భావించే బిల్డింగ్ లాకర్‌లోకి ఎలా వెళ్లారు. దాన్ని ఎలా దొంగించారనేది లాజిక్‌గా అందదు. మరోవైపు దుబాయ్‌లో భారత సైంటిస్టులను కిడ్నాపింగ్ సీన్ అంత కన్విన్సింగ్‌గా ఉండదు. దుబాయ్‌లో సెక్యూరిటీ గట్రా మన దేశంలో లాగే  కాస్త సెక్యూరిటీ  ఎక్కువగా ఉంటుంది. ఒక ఉగ్రవాది హెలికాప్టర్‌ నుంచి దేశం విడిచి వెళ్లే లోపే వాళ్ల మిస్సైల్స్‌తో అతన్ని అంతం చేయవచ్చు. కానీ అందులో మన దేశానికి చెందిన సైంటిస్ట్ ఉండటం వల్ల వాళ్లు ఏమి చేయలేకపోయానేది దర్శకుడు పాయింట్ కావచ్చు. ఇక  ఈ సినిమాకు ‘పఠాన్’ కాకుండా ఏ టైటిల్ పెట్టినా పెద్దగా వచ్చిన ఇబ్బంది లేదు. ఏది ఏమైనా యాక్షన్ ప్రియులు ఇష్టపడే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమాను చూసిన ఫీలింగ్ తెచ్చాడు దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్.

దర్శకుడు కాకుండా ఇతర సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు సత్‌చిత్ ఫౌలోస్ ఫోటోగ్రఫీ గ్రాండియర్ బాగుంది. విదేశాల్లో ముఖ్యంగా మంచుపై ఫైటింగ్, క్లైమాక్స్‌లో ఫైట్స్ కెమెరాలో  బాగున్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ పై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది.  ఆ కష్టం తెరపై కనిపిస్తోంది. సినిమాకు అందించిన ఆర్ఆర్ బాగుంది.యశ్ రాష్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. 

షారుఖ్ ఖాన్.. లేటు వయసులో ‘పఠాన్’గా ఎయిట్ ప్యాక్‌తో తన యాక్షన్ సన్నివేశాలతో మరోసారి అదరగొట్టేసాడు. కాదు కాదు హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడనే చెప్పాలి. ఇందులో ప్రతి సన్నివేశంలో ఎంతో ఎనర్జిటిక్‌‌గా కనిపించాడు. జాన్ అబ్రహం పాత్ర ఈ సినిమాలో కీలకం అని చూపాలి. ధూమ్ తర్వాత ఆ స్థాయి విలనిజం ఈ సినిమాలో పండించాడు. సినిమాకు నాయకుడిగా షారుఖ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడో.. ప్రతి నాయకుడిగా జాన్ అబ్రహం పాత్ర అంతబాగా నటించాడు. దీపికా పదుకొణే.. ఐఎస్ఐ ఏజెంట్ రూబీ ఖాన్ పాత్రలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. బాండ్ గర్ల్ తరహాలో సినిమాలో ఎక్కడ ఏ మేరకు అవసరం అక్కడ అంగాంగ ప్రదర్శన చేసినా.. కథలో భాగంగా ఉంది. టైగర్‌గా ఓ సన్నివేశంలో పఠాన్‌ను కాపాడే సీన్‌లో సల్మాన్ ఎంట్రీ అదిరింది.  ఇక నందిని క్యారెక్టర్‌లో డింపుల్ కపాడియా, రా ఛీఫ్ పాత్రలో అశుతోష్ రాణా నటన బాగుంది. మిగిలిన నటీనటులుక పెద్దగా యాక్ట్ చేసే ఛాన్స్ రాలేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ 

షారుఖ్, జాన్ అబ్రహం‌ల నటన

యాక్షన్స్ కమ్ ఎలివేషన్  సీన్స్

సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్

మైనస్ పాయింట్స్ 

సాదాసీదా కథ

ఫస్టాప్

గ్రాఫిక్స్

రేటింగ్ : 2.75/5

చివరి మాట: ఆకట్టుకునే  ‘స్పై’ యాక్షన్ థ్రిల్లర్

First published:

Tags: Bollywood news, Deepika Padukone, John Abraham, Pathaan Movie, Shah Rukh Khan

ఉత్తమ కథలు