రూ.41లక్షలు మోసం... పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పటాస్ రవి...

పటాస్ రవి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: February 9, 2020, 10:43 PM IST
రూ.41లక్షలు మోసం... పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పటాస్ రవి...
యాంకర్ రవి ఫైల్ ఫోటో (Anchor Ravi music video)
  • Share this:
పటాస్ రవి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సందీప్ అనే వ్యక్తి దన దగ్గర రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేశాడని సందీప్ మోసం చేశాడంటూ పటాస్ రవి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే, ఆ సందీప్ అనే వ్యక్తి 2018 అక్టోబర్‌లో పటాస్ రవి మీద ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యాంకర్ రవి తనను బెదిరిస్తున్నాడని, తనకు శారీరకంగా హాని చేస్తానని హెచ్చరిస్తున్నాడంటూ డిస్ట్రిబ్యూటర్ సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. రవి వద్ద తీసుకున్న రూ.15లక్షలను తిరిగి చెల్లించకపోతే తన అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యాంకర్ రవి హీరోగా నటించిన ఇది మా ప్రేమ కథ సినిమాకు సందీప్ డిస్ట్రిబ్యూటర్. అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే, అప్పట్లో గుడ్ విల్ కింద డబ్బులు ఇచ్చిన రవి.. మళ్లీ ఆ డబ్బులు తిరిగివ్వాలని బెదిరిస్తున్నాడంటూ సందీప్ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఇప్పుడు రవి... తనకు సందీప్ రూ.41లక్షలు మోసం చేశాడంటూ కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు.
First published: February 9, 2020, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading