హోమ్ /వార్తలు /సినిమా /

పటాస్ నుండి పక్కకు తప్పుకున్న శ్రీముఖి..

పటాస్ నుండి పక్కకు తప్పుకున్న శ్రీముఖి..

యాంకర్ శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి

శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటోంది ఈ భామ. 'పటాస్' షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. అలాంటీ షో నుండి కొంత కాలం విరామం తీసుకున్నట్లు శ్రీముఖి ప్రకటించింది.

ఇంకా చదవండి ...

  శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటోంది ఈ భామ. శ్రీముఖి..'పటాస్' షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టిన..శ్రీముఖి, ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారి కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అటూ సినిమాలు చేస్తూనే ఇటూ యాంకరింగ్ చేస్తూ..తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఇటీవలే శ్రీముఖి పుట్టిన రోజు కూడా జరుపుకుంది. అది అలా వుంటే ఆమెకు అంతాలా పేరు తెచ్చిన 'పటాస్' షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. అయితే 'పటాస్' షోకు ప్రధాన ఆకర్షణ శ్రీముఖి.  తన అందం, అల్లరితో షోను పరుగులు తీయించడమే కాదు, తన గ్లామర్‌తో కొత్త అందాన్ని తీసుకొచ్చింది ఆ షోకి. అలాంటీ శ్రీముఖి షోలో లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆసక్తిగా మారింది.


  శ్రీముఖి


  మరీ శ్రీముఖి విరామం తీసుకుండడంతో ఆమె పాత్రలో నిర్వాకులు ఎవరిని దించనునన్నారని ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. శ్రీముఖి మాత్రం 'పటాస్' షో ప్రొడ్యూసర్స్ అనుమతితోనే బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాని కారణం మాత్రం వెల్లడించలేదు. అయితే ఇక్కడ విశేషమేమంటే, ఇంతకుముందు 'పటాస్' షోను చేస్తోన్న కొంతమంది ఆర్టిస్టులు ఇటీవల ఈ షోకి దూరమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యాంకర్ శ్రీముఖి ఇలా బ్రేక్ తీసుకోవడం ..'పటాస్' ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలకు దారితీస్తోంది.  First published:

  Tags: Anchor srimukhi, Jabardasth comedy show, Sreemukhi, Tamil Cinema, Tamil Film News, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie, Telugu tv anchors, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News, Tollywood news

  ఉత్తమ కథలు