హోమ్ /వార్తలు /సినిమా /

Jagan: మహేష్ బాబు నోట జగన్ డైలాగ్స్ ... అందుకే పెట్టానన్న పరుశురాం

Jagan: మహేష్ బాబు నోట జగన్ డైలాగ్స్ ... అందుకే పెట్టానన్న పరుశురాం

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో జగన్ డైలాగ్స్ కనిపించడం అందర్నీ షాక్‌కు గురి చేశాయి. మహేష్ నాట జగన్ డైలాగ్స్ ఎందుకు వచ్చాయన్న ప్రశ్నలకు .. డైరెక్టర్ పరుశురాం క్లారిటీ ఇచ్చారు.

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో జగన్ డైలాగ్స్ కనిపించడం అందర్నీ షాక్‌కు గురి చేశాయి. మహేష్ నాట జగన్ డైలాగ్స్ ఎందుకు వచ్చాయన్న ప్రశ్నలకు .. డైరెక్టర్ పరుశురాం క్లారిటీ ఇచ్చారు.

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో జగన్ డైలాగ్స్ కనిపించడం అందర్నీ షాక్‌కు గురి చేశాయి. మహేష్ నాట జగన్ డైలాగ్స్ ఎందుకు వచ్చాయన్న ప్రశ్నలకు .. డైరెక్టర్ పరుశురాం క్లారిటీ ఇచ్చారు.

మ‌హేష్ బాబు, ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. (SVP) ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. త‌మ‌న్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇవాళ ప్రిరిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోనుంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా వారం రోజులే ఉండ‌టంతో.. పరశురామ్ అండ్ టీమ్ ప్రమోషన్లలో బిజీగా మారింది. జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

సర్కారు వారి పాట విషయానికి వస్తే... ఇందులో ఓ డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. `నేను విన్నాను.. నేను ఉన్నాను`అంటూ తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుకున్న ఈ నినాదం ప్రజల్లోకి ఎంతో బలంగా వెళ్లింది. మాస్‌ను మెప్పించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్‌ను విడుద చేశారు. అయితే అందులో ముఖ్యంగా ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ తెగ వైర‌ల్ అయ్యింది. అయితే పరుశురాం ఈ డైలాగ్‌ను ఎందుకు పెట్టారన్న దానిపై ఇటు ఇండస్ట్రీతో పాటు..అటు పొలిటికల్‌గాను ఆసక్తికర చర్చ కొనసాగింది. అయితే తాజాగా ఈ డైలాగ్ ఎందుకు పెట్టానన్నదానిపై క్లారిటీ ఇచ్చేశాడు పరుశురాం.

ఈ మాటను దివంగ‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటుండేవారు.ఆయ‌న కుమారుడు వై.ఎస్‌.జ‌గ‌న్, ఏపీ సీఎంగా ఉండ‌టంతో స‌ద‌రు పార్టీ వ‌ర్గాలు కూడా డైలాగ్‌కి బాగా క‌నెక్ట్ అయ్యాయి. అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఆ డైలాగ్‌ను ప‌ర‌శురామ్ ఎందుకు రాయాల్సి వ‌చ్చింది అనే సందేహం కూడా సినీ ప్రముఖులతో పాటు... రాజకీయ ప్రముఖులకు కూడా వచ్చింది. దీనిపై ద‌ర్శ‌కుడు పరుశురామ్ క్లారిటీ ఇచ్చాడు. ఆయ‌న చెప్పిన ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ అనే మాట నాకెంత‌గానో న‌చ్చింది. చాలా పెద్ద మీనింగ్ ఉన్న దాన్ని చిన్న‌మాట‌గా భ‌లే చెప్పారే అనిపించింది. అలాంటి సిట్యువేష‌న్ ‘సర్కారు వారి పాట’లోవచ్చినప్పుడు.. హీరో మహేష్‌గారు కీర్తి సురేష్‌కి మాట ఇవ్వాల్సి వ‌చ్చిన‌ప్పుడు ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ స్క్రిప్టులో రాసుకున్నాను. షూటింగ్ స‌మ‌యంలోనూ మ‌హేష్‌గారు కూడా దీనిపై అభ్యంత‌రం చెప్ప‌లేదు’’ అన్నారు.అందుకే అలా ఆ డైలాగ్‌ను తన సినిమాలో పెట్టానని పరుశురాం చెప్పుకొచ్చారు.

ఇక సర్కారు వారా పాట మే 12న సినిమాని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ నుండి టీజర్లు, పాటలు ఈ సినిమాలోని పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి. మేకర్స్ ట్రయిల్ కూడా రిలీజ్ చేశారు. 105 షాట్స్ కాంబినేష‌న్‌లో విడుదలైన ‘సర్కారు వారి పాట’ ట్రైల‌ర్ అంద‌రినీ అల‌రిస్తుంది. ఒక వైపు మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

First published:

Tags: Mahesh Babu, Parusuram patla, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు