హోమ్ /వార్తలు /సినిమా /

Krithi Shetty: నిండా 18 ఏళ్ళు లేవు.. అప్పుడే అలాంటి భర్త కావాలంటూ కోరికలు బయటపెట్టిన బేబమ్మ?

Krithi Shetty: నిండా 18 ఏళ్ళు లేవు.. అప్పుడే అలాంటి భర్త కావాలంటూ కోరికలు బయటపెట్టిన బేబమ్మ?

krithi shetty

krithi shetty

Krithi Shetty: ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఒక్క చూపుతో, ఒక్క నవ్వుతో

Krithi Shetty: ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకున్న బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఒక్క చూపుతో, ఒక్క నవ్వుతో కుర్రాళ్ల మతి పోగొట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా ఒక్క సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి పై మనసు పారేసుకున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తన కాబోయే భర్త గురించి మనసులో మాటను బయట పెట్టేసింది బేబమ్మ.

ఈ బ్యూటీ ఒక్క సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకుంటుంది. తాజాగా కొన్ని విషయాలు అభిమానులతో పంచుకున్న ఈ బ్యూటీ.. తన జీవితంలోకి తనకు భర్తగా వచ్చే వ్యక్తి.. ఏ విషయంలోనైనా దాపరికం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి వస్తే బాగుంటుందని తెలిపింది. అంతే కాకుండా ఆమెకు అబద్ధాలు చెప్పే వాళ్లంటే అసలే నచ్చరట. మొత్తానికి తన కాబోయే వాడి గురించి మనసులో మాట బయట పెట్టేసింది. దీంతో నిండా 18 ఏళ్ళు లేవు.. అప్పుడే భర్త కావాలా అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు సినిమాలలో బిజీగా ఉండగా.. అందులో లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న 'రాపో-16' సినిమాలో నటిస్తుంది. ఇక న్యాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా మరో హీరో సుధీర్ బాబుతో కలసి 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఇవే కాకుండా మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని వార్తలు వినిపించగా.. అది కేవలం పుకార్లు అని తోసిపుచ్చింది. మొత్తానికి టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరోలతో అవకాశాలు అందుకున్న కృతి శెట్టి మళ్లీ తన ఖాతాలో ఎటువంటి సక్సెస్ ను వేసుకుంటుందో చూడాలి.

First published:

Tags: Bebamma, Bucchi babu, Krithi shetty, Nani, PARTNER, Shyama singh roy, Uppena film, Vishnav tej

ఉత్తమ కథలు