పెళ్లి పై పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమందో తెలుసా..

బాలీవుడ్ భామ పరిణణీతి చోప్రా అక్షయ్ కుమార్ తో తను నటించిన "కేసరి" చిత్ర ప్రచారం లో భాగంగా మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ భామ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

news18-telugu
Updated: March 19, 2019, 1:05 PM IST
పెళ్లి పై పరిణీతి చోప్రా సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమందో తెలుసా..
పరిణీతి చోప్రా
  • Share this:
బాలీవుడ్ భామ పరిణణీతి చోప్రా అక్షయ్ కుమార్ తో తను నటించిన "కేసరి" చిత్ర ప్రచారం లో భాగంగా మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మనీష్ శర్మ, సహాయదర్శకుడు చరిత్ దేశాయ్‌తో ప్రేమాయణం గురించి ప్రశ్నించగా .. ‘నిజంగా చెబుతున్నా.. నా ప్రేమ జీవితం గురించి మాట్లాడేందుకు నేను సిద్ధంగా లేను. ఆ విషయం అందరికీ ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది' అని సమాధానం ఇచ్చారు.తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ " జీవితంలో ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి చేసుకుంటా. వివాహానికి సమయం, వయసుతో పనిలేదు. పెళ్లి అనేది ఒక వ్యక్తి మెంటల్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది, నేను ఆలా ఆలోచిస్తే రేపే నా పెళ్లి జరగొచ్చు లేదా ఇంకా ఐదేళ్లు పట్టచ్చు" అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పరిణితీ చోప్రా 1897లో జరిగిన సారాగడీ యుద్ధంలో ఆఫ్గన్లతో పోరాడిన సిక్కు సైనికుల నేపధ్యం లో తెరకెక్కిన కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.వీటితో పాటు సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించడానికి  ఓకే చెప్పింది.

 

First published: March 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు