షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. మెడపై గాయాలు..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తీశిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబుతున్నాయి. ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో పరిణితీ చోప్రా తీవ్రంగా గాయపడింది.

news18-telugu
Updated: November 16, 2019, 7:21 AM IST
షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. మెడపై గాయాలు..
షూటింగ్‌లో గాయపడ్డ పరిణితీ చోప్రా (Instagram/Photo)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తీశిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబుతున్నాయి. ఈ రూట్లోనే వచ్చిన ‘మేరికోమ్’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘పాస్ సింగ్ తోమర్’ వంటి సినిమాలు బాలీవుడ్‌లో కొత్త హిస్టరీని క్రియేట్ చేసాయి.ఆ తర్వాత క్రికెటర్స్ మీద తీసిన ‘అజారుద్దీన్’, ‘ఎం.ఎస్.ధోని’, ‘సచిన్’ సినిమాలు కూడా మంచి ఫలితాలనే అందుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో మన దేశానికి క్రికెట్‌లో తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ..రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘83’ బయోపిక్ తెరకెక్కుతోంది. వీటితో పాటు బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ సెట్స్ పైకి ఉంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కోసం పరిణితీ చోప్రా.. బాట్మింటన్ కోసం బాగానే ప్రాక్టీస్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పరిణితీ చోప్రా తీవ్రంగా గాయపడింది. మెడపై కాస్త దెబ్బ తగిలినట్టు కనబడుతోంది. ఈ విషయాన్ని పరిణితీ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.అమోల్ గుప్తా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...