పరిణితీ చోప్రాకు చుక్కలు చూపిస్తోన్న సైనా నెహ్వాల్..

బ్యాడ్మింటన్ లో ఎన్నో ఎత్తుపల్లాలు అధిగమించి భారత్ కి చిరస్మరణీయమైన పతకాలు అందించిన సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రస్తుతం సైనా గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా బ్యాడ్మింటన్ ఆడుతున్న తన ఫొటోను, అలసిపోయి అక్కడే పడుకుని ఉన్న ఫొటోను పరిణీతి ట్విట్టర్‌లో షేర్ చేసింది.

news18-telugu
Updated: June 19, 2019, 3:29 PM IST
పరిణితీ చోప్రాకు చుక్కలు చూపిస్తోన్న సైనా నెహ్వాల్..
సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా
  • Share this:
బ్యాడ్మింటన్ లో ఎన్నో ఎత్తుపల్లాలు అధిగమించి భారత్ కి చిరస్మరణీయమైన పతకాలు అందించిన సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రస్తుతం సైనా గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టీ సిరీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు  అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌కు  తీసుకున్న, ఆ తరువాత ఇతర కారణాలవల్ల శ్రద్ధా ఈ ప్రాజెక్టునుండి వైదొలిగింది. ఈ పాత్ర కోసం శ్రద్ధ, సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో కోచింగ్ కూడా తీసుకుని కష్టపడింది. ఈ సినిమా కి ఆమె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు కానీ ఆమె అర్ధాంతరంగా వైదొలగడం తో సైనా పాత్రలో యాక్ట్ చేసే ఛాన్స్ పరిణీతి ని వరించింది. అయితే పరిణితికి కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి కోచ్ అవతారమెత్తింది. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం సైనా వద్ద బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది పరిణితి.

Parineeti chopra expresses feeling on badminton over saina nehwal biopic,parineeti chopra,saina nehwal biopic,saina nehwal,parineeti chopra saina nehwal,parineeti chopra in saina nehwal biopic,parineeti chopra saina nehwal biopic,parineeti saina nehwal biopic,saina nehwal biopic trailer,saina nehwal biopic movie,biopic on saina nehwal,latest news on parineeti chopra,saina nehwal movie,parineeti chopra news,saina nehwal biography,shraddha kapoor saina nehwal biopic,పరిణితీ చోప్రా,సైనా నెహ్వాల్,పరిణితీ చోప్రా,సైనా నెహ్వాల్ బయోపిక్ పరిణితీ చోప్రా,టాలీవుడ్,కోలీవుడ్,,బాలీవుడ్,హిందీ సినిమా,సైనా నెహ్వాల్ బయోపిక్,
సైనా దగ్గర బాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తోన్న పరిణితీ (ట్విట్టర్ ఫోటో)


ఐతే ఈ శిక్షణ పరిణితికి కష్టంగా వుంది కాబోలు .. తాజాగా బ్యాడ్మింటన్ ఆడుతున్న తన ఫొటోను, అలసిపోయి అక్కడే పడుకుని ఉన్న ఫొటోను పరిణీతి ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి `ప్రాక్టీస్‌కు ముందు.. తర్వాత  అంటూ కాప్షన్ కూడా తగిలించి .. సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు అని కామెంట్ చేసింది. ఇది చుసిన నెటిజన్లు ప్రాక్టీస్ సమయంలోనే చుక్కలు కనబడుతునట్టున్నాయి  అంటూ కామెంట్ చేస్తున్నారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు