• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PARESH RAWAL RESPONDS ON DEATH HOAX WITH REPLY HERE HERE ARE THE DETAILS TA

Paresh Rawal: నేను కరోనాతో చనిపోయానా అంటూ.. సోషల్ మీడియాపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరేష్ రావల్..

Paresh Rawal: నేను కరోనాతో చనిపోయానా అంటూ.. సోషల్ మీడియాపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరేష్ రావల్..

పరేష్ రావల్ (File/Photo)

Paresh Rawal:  సోషల్ మీడియా ప్రస్తుతం ప్రజలతో విడదీయారాని అనుబంధం ఉంది. ప్రజలు ఫేస్‌బుక్, వాట్సాప్, షేర్‌ఛార్ట్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఏదో ఒక దాంట్లో లేని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి లేదు. తాజాగా పరేష్ రావల్ కరోనాతో చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై పరేష్ రావల్ స్పందించారు.

  • Share this:
    Paresh Rawal:  సోషల్ మీడియా ప్రస్తుతం ప్రజలతో విడదీయారాని అనుబంధం ఉంది. ప్రజలు ఫేస్‌బుక్, వాట్సాప్, షేర్‌ఛార్ట్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఏదో ఒక దాంట్లో లేని వారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి లేదు.  దీని వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉందో.. అంతకంటే ఎక్కువ చెడు కూడా ఉంది. ఒక్కసారి సోషల్ మీడియా వల్ల ప్రజలకు నిజాల కంటే ఒక్కోసారి అబద్ధాలు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వల్ల పరేష్ రావల్ ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసారు. ఈయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈయన డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఈయన ఈ రోజు ఉదయం 7 గంటలకు చనిపోయినట్లు ఎవరో ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పరేష్ రావల్.. ఆ సమయంలో నేను చనిపోలేదు.. ఇంకా పడుకొని ఉన్నానంటూ చాలా ఛమత్కారంగా సమాధానమిచ్చారు.


    గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విలక్షణ నటుడిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్‌గా (NSD) నియమించారు. పరేష్ రావల్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో తనదైన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా పలు చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నటుడిగా ఆయన గుజరాతి చిత్రం ‘నసీబ్ నీ బలిహరి’ చిత్రంతో నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో పరేష్ రావల్ ‘క్షణ క్షణం’, ‘గోవిందా గోవిందా’, ‘మనీ’ మనీ మనీ’ ‘రిక్షావోడు, ‘బావగారు బాగున్నారా,  ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ‘తీన్మార్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. అటు తెలుగులో పాటు మరాఠీ, ఇంగ్లీష్ చిత్రాల్లో విలక్షణ నటనతో మెప్పించారు.

    ఈయన బీజేపీ తరుపున 2014లో అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు సినిమారంగంలో ఈయన కృషిని గుర్తిస్తూ..ఈయన్ని 2014లో కేంద్రం  పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. మరోవైపు ‘వో చోక్రి’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. దాంతో పాటు పలు చిత్రాల్లో తన నటనతో పలు అవార్డులు రివార్డులు సొంతంచేసుకున్నారు. ఇక సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జీవితంపై తెరకెక్కిన ‘సర్థార్’ సినిమాలో పటేల్ పాత్ర పరేష్ రావల్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: