Mahesh Babu : పండగే అంటున్న పరశురామ్.. హీరోయిన్‌ ఫిక్స్..

Mahesh Babu : మహేష్ బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన వంశీతో ఓ సినిమా చేయాలి.

news18-telugu
Updated: May 15, 2020, 6:20 AM IST
Mahesh Babu : పండగే అంటున్న పరశురామ్.. హీరోయిన్‌ ఫిక్స్..
మహేష్ పరశురామ్ Photo : Twitter
  • Share this:
Mahesh Babu : మహేష్ బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన వంశీతో ఓ సినిమా చేయాలి.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో మహేష్ ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా దాదాపు ఖారరైంది. ఈ విషయమై తాజాగా పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మహేష్ తదుపరి సినిమాను చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పేర్కోన్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా  తీసుకొనున్నారని తెలుస్తోంది. కీర్తి మహానటి సినిమాలో అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని తెలుస్తోంది. మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. అంతేకాదు ఫ్యాన్స్ కి కావలసిన అంశాలతో మహేష్ ఇమేజ్ కి సరిపోయేలా పరుశురాం ఓ బెస్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచారట. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరో ఆసక్తి వార్త ఏమంటే.. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. గోపీసుందర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31 విడుదల చేయనుంది చిత్రబృందం.
First published: May 15, 2020, 6:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading