హోమ్ /వార్తలు /సినిమా /

సర్కారు వారి పాటలో.. భీమ్లా నాయక్ రింగ్ టోన్ అందుకే పెట్టాం..పరశురాం కీలక వ్యాఖ్యలు

సర్కారు వారి పాటలో.. భీమ్లా నాయక్ రింగ్ టోన్ అందుకే పెట్టాం..పరశురాం కీలక వ్యాఖ్యలు

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్

సర్కారు వారి పాట సినిమాలో పదే పదే సుబ్బరాజు(Subba Raju)కు హీరో మహేష్‌బాబు కాల్ చేస్తుంటాడు. దీంతో సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా ‘లాలా.. భీమ్లా’(lala bheemla song) అనే రింగ్ టోన్ వినిపిస్తుంది.

మహేష్ బాబు (Mahesh Babu)హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట(Sarkaru Vaari Pata).ఈ సినిమా సక్సెస్‌తో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాతాలో మరో హిట్ పడింది. ఈ నెల 12న సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. తొలిరోజు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు పవర్‌స్టార్ అభిమానులకు కూడా కిక్కిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌లోని ఓ పాట వినపడుతుంది.

సర్కారు వారి పాట సినిమాలో పదే పదే సుబ్బరాజు(Subba Raju)కు హీరో మహేష్‌బాబు కాల్ చేస్తుంటాడు. దీంతో సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా ‘లాలా.. భీమ్లా’(lala bheemla song) అనే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ వినిపించినప్పుడల్లా థియేటర్లలో పవర్ స్టార్ (Power Star)అభిమానులు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కారు వారి పాట ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా సందడి చేశారు. అలాగే సినిమా ప్రారంభంలో మహేష్ చిన్నతనంలో టాటూ వేయించుకునే సమయంలో.. ఏ పచ్చబొట్టు కావాలి అని ఓ ముసలావిడ అడుగుతుంది. కృష్ణది కావాలా.. చిరంజీవిది కావాలా అని ప్రశ్నిస్తుంది. చిరంజీవి పేరు వినిపించడంతో ఆ సమయంలో కూడా మెగాస్టార్ అభిమానులు విజిల్స్‌తో సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పాట రింగ్ టోన్ ఎందుకు పెట్టారన్న దానిపై డైరెక్టర్ పరుశురాం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ పాట వినిపించగానే.. అంతా పరుశురాం తన నెక్ట్స్ మూవీ పవర్ స్టార్‌తోనే అని అనుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. పరుశురాం సమాధానం ఇచ్చారు. త్వరలోనే.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని.. కళ్యాన్ బాబును కలిసి మంచి కథ వినిపిస్తానన్నారు. పవన్ కళ్యాన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అంతేకాకుండా.. భీమ్లా నాయక్ రింగ్ టోన్ ఎందుకు పెట్టామన్న విషయం కూడా చెప్పుకొచ్చారు. వేరే రింగ్ టోన్ పెడితే సరిగా ఆడియో వినిపించడం లేదని.. దీంతో తాను తమన్ కలిసి భీమ్లా నాయక్ రింగ్ టోన్ పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు. అలా పవర్ స్టార్ పాటను.. మహేష్ బాబు మూవీలో వాడేసామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ పరుశురాం.

First published:

Tags: Bheemla Nayak, Bheemla nayak title song, Mahesh Babu, ParasuRam, Pawan kalyan, Sarkaru Vaari Paata

ఉత్తమ కథలు