#SSMB27 : మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత ఇంతవరకు ఆయన ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్నాడని.. ఈ సినిమా దాదాపు ఖారరైందని ఓ వార్త గత కొంతకాలంగా హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మహేష్ తదుపరి సినిమాను చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పేర్కోన్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె ‘సారా అలీ ఖాన్’ నటించబోతుందని ఓ వార్త హల్ చల్ చేయడం తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ నటించబోతుందని, ఆ తరువాత కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇంతకీ సూపర్ స్టార్ పక్కన నటించే ఆ హీరోయిన్ గురించి క్లారిటీ వచ్చింది. సారా, కీర్తి, కియారాలలో, మహేష్ సరసన కీర్తి సురేష్‌ను హీరోయిన్గా తీసుకొనున్నారని తెలుస్తోంది. కీర్తి మహానటీ సినిమాలో అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా రానుందని తెలుస్తోంది. మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా రానుందని సమాచారం. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరో ఆసక్తి వార్త ఏమంటే.. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రకు బాగుంటాడని దర్శకుడు భావిస్తున్నాడట. ఉపేంద్ర.. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.