Home /News /movies /

PARANNA JEEVI FIRST LOOK RELEASED JABARDASTH COMEDIAN SHAKALAKA SHANKAR WILL BE THE LEAD SR

RGV : పరాన్నజీవి ఫస్ట్ లుక్... వర్మ పాత్రలో జబర్దస్త్ కమెడియన్..

పరాన్నజీవి పోస్టర్ Photo : Twitter

పరాన్నజీవి పోస్టర్ Photo : Twitter

Parannajeevi : రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' కి పోటీగా పవన్ కళ్యాణ్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

    Ram Gopal Varma :  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ లాక్ డౌన్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. అడల్ట్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీసిన ఆయన.. ఆ తర్వాత కొత్త అమ్మాయి శ్రీ రాపాకతో నగ్నం తీసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మర్డర్ అని, థ్రిల్లర్ అని రెండు మూడు సినిమాలు ప్రకటించిన వర్మ.. 'పవర్ స్టార్'‌ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎవరిని ఉద్ధేశించి కాదని పేర్కోంటూ ఈ చిత్రానికి సంబందించి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తోన్న వర్మ ఇటీవల గడ్డి తింటావా అంటూ ఓ పాటను, తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. అయితే టైటిల్ లోగోలో గ్లాస్ పిక్‌ను ఉంచి పవన్ కళ్యాణ్‌ను గుర్తకు తెచ్చేలా ఉండే ఓ వ్యక్తితో ప్రధాన పాత్ర చేయించడంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే అని భావిస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమా ట్రైలర్‌కు కూడా వర్మ డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


    సినీ చరిత్రలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్ కి కూడా టికెట్ ధర నిర్ణయించాడు. జూలై 22న ఉదయం 11 నుండి "పవర్ స్టార్" ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు వర్మ. అయితే వెన్నుపోటు అంశాన్ని తన సినిమాల్లో ఎక్కువగా ప్రస్తావించే వర్మనే వెన్నుపోటు పొడిచారు ఆయన దగ్గర పనిచేసే వర్కర్స్. వర్మకి షాక్ ఇస్తూ.. ‘పవర్ స్టార్’ ట్రైలర్‌ను ఆన్ లైన్‌లో విడుదల చేశారు ఆయన దగ్గర పనిచేసే సిబ్బంది. దీంతో ఆయన తన పవర్ స్టార్ ట్రైలర్‌ను తన య్యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు.  అది అలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' కి పోటీగా పవన్ కళ్యాణ్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. వర్మ మీద సెటైరికల్ గా రూపొందుతున్న ఈ సినిమాకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహించనున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ 'పరాన్నజీవి' సినిమా నుండి 'పరాన్నజీవి.. జీవి నిర్జీవి ఆర్జీవీ..' అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేసారు. ఇప్పుడు తాజాగా 'పరాన్నజీవి' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్‌ ఈ సినిమాలో ఆర్జీవీగా కనిపించనున్నాడు.


    ఇక 'పవర్ స్టార్' సినిమాని జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేస్తునట్లు వర్మ ప్రకటించగా.. ఈ పరాన్నజీవి సినిమాను కూడా అదే రోజు అదే సమయానికి శ్రేయాస్ ఏటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఎవరి సినిమా ఎంత ఆదరణ పొందుతుందో. ఎవరు ఈ పోరులో ప్రక్షకుల మనుస్సును, డబ్బును దోచుకోనున్నారో..
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Jabardasth, Power Star Movie, Ram Gopal Varma, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు