Home /News /movies /

PARAMPARA2 WEB SERIES PRE RELEASE EVENT IN HYDERABAD SB

Parampara 2:"పరంపర 2" ప్రీ రిలీజ్.. ఇది ఓ నాన్ వెజ్ మీల్స్ అన్న నవీన్ చంద్ర..!

పరంపర సీజన్ 2 ట్రైలర్ విడుదల (Twitter/Photo)

పరంపర సీజన్ 2 ట్రైలర్ విడుదల (Twitter/Photo)

రెండేళ్ల కిందట నుంచి ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ లో ఉన్నామన్నారు. ఫైనల్ గా ఇప్పుడు సెకండ్ సీజన్ తో మీ ముందుకు వస్తున్నామని తెలిపారు డైరెక్టర్.

    డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 కు రెడీ అవుతోంది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.

    ఈ సందర్భంగా దర్శకుడు అరిగెల విశ్వనాథ్ మాట్లాడుతూ...పరంపర 2 లో మరింత యాక్షన్, డ్రామాను చూస్తారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర పర్మార్మెన్స్ ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో గోపీ లక్షణాలు ఏమాత్రం లేని వ్యక్తి నవీన్ చంద్ర అన్నారు. అతనితో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నవీన్ చంద్ర క్యారెక్టర్ మాత్రమే కాదు శరత్ కుమార్, జగపతిబాబు, రవివర్మ, ఆకాంక్ష సింగ్, దివి ..ఇలా వీరందరి క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ఆర్కా మీడియాకు బాహుబలి 2 ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో, పరంపర 2 కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలి అన్నారాయన.



    నటుడు రవి వర్మ మాట్లాడుతూ...ఈ వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ చేశానన్నారు. ఒక నటుడికి కావాల్సింది సహ నటుల ప్రోత్సాహమన్నారు. నవీన్ చంద్ర నుంచి నాకు ప్రతిసారీ అలాంటి ప్రోత్సాహం అందుతూనే ఉందన్నారు. అతనితో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశానని తెలిపారు. ఇక నటి బిగ్ బాస్ దివి మాట్లాడుతూ...నా క్యారెక్టర్ ఇందులో స్పెషల్ గా ఉంటుందని తెలిపింది. వెబ్ సిరీస్ చివరలో నా పాత్ర ఇంపార్టెంట్స్ ఏంటో తెలుస్తుందన్నారు. బిగ్ బాస్ తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్న టైమ్ లో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి ఈ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందని దివి తెలిపింది. ఇది నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నానంది

    హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ...రచన అనే పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలుగులో నేను నటించిన చిత్రాలు కొన్నే... అయినా నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఆర్కా మీడియాకు థాంక్స్ తెలిపారామె. తన పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందన్నారు చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర తనదన్నారు ఆకాంక్ష. నటించకుండా నేనే రచన అనుకుని నటించానన్నారు. పరంపర 2 అంటే గోపీ, రచన మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది, వెబ్ సిరీస్ లో చూసి ఎంజాయ్ చేయాలన్నారు.

    హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ...పరంపర సీజన్ 1 వెజ్ థాలి అయితే, పరంపర 2 నాన్ వెజ్ మీల్స్. మరింత డ్రామా, యాక్షన్, రివేంజ్ చూస్తారు. సీజన్ 2 స్ట్రీమింగ్ కు కొద్ది రోజులే ఉందన్నారు. కాబట్టి మొదటీ సీజన్ చూసేయండన్నారు, అప్పుడు మీకు సెకండ్ సీజన్ క్లియర్ గా అర్థమవుతుందని తెలిపారు. అలాగే ఫస్ట్ సీజన్ లో మీక ఏ అంశాలైతే మిస్ అయ్యాయి అనిపించాయో, వాటికి సీజన్ 2 లో సమాధానం దొరుకుతుందన్నారు నవీన్ చంద్ర.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Disney plus hotstar, Webseries

    తదుపరి వార్తలు