Home /News /movies /

PARAMPARA SEASON 2 WEB SERIES RELEASE DATE FIX SB

Parampara 2: పరంపర 2 వెబ్ సిరీస్ వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

త్వరలో డిస్నీహాట్ స్టార్‌లో పరంపర సీజన్ 2 (Twitter/Photo)

త్వరలో డిస్నీహాట్ స్టార్‌లో పరంపర సీజన్ 2 (Twitter/Photo)

Parampara 2: పరంపర 2 వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ వెబ్ సిరీస్...ఈ నెల నుంచే డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    యంగ్ హీరో నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర

    తన క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు నవీన్ చంద్ర.  ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని... అదే  సెకండ్ సీజన్ లో  అతని మీద తాను పైచేయి సాధిస్తానన్నారు నవీన్ చంద్ర. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే  పరంపర వెబ్ సిరీస్ అన్నారు.



    పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగామన్నారు నవీన్ చంద్ర. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారరన్నారు.

    పరంపర వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Disney+ Hotstar, Web Series

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు