మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ).. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి తొలి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. రంగ రంగ వైభవంగా డిసెంబర్ 18, 2022న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారంకానుంది. దీనికి సంబంధించి ప్రకటన విడుదలైంది. నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, సుబ్బరాజు, తులసి, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.
World Television Premieres Movie: #panjavaisshnavtej , #ketikaSharma , #naveenchandra Staring Latest Family Entertainer #RangaRangaVaibhavanga Next Sunday Dec 18th 6pm on @ZeeTVTelugu#RRVOnZeeTelugu@panjavishnavtej@TheKetikaSharma @GIREESAAYA @SVCCofficial @Naveenc212 @BvsnP pic.twitter.com/hWXdKcUL4z
— TSRU UPDATES (@TsruUpdates) December 11, 2022
ఈ సినిమాలో కొత్తగా లేదేంటి' అంటూ సాగుతోన్న పాట నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. రొమాంటిక్‌గా సాగుతోన్న పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అర్మాన్ మాలిక్, హరిప్రియ పాడగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు. రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ (Ketika sharma) కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన నటించింది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.
ఇక వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొండపొలం విషయానికి వస్తే.. రవీంద్రనాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఎంత ప్రయత్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేపడం కోసం కొండపొలానికి వెళ‌్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్.ఎస్ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ketika sharma, Tollywood news, Vaishnav tej