Home /News /movies /

PANJA VAISSHNAV TEJ IN A RAW AND STUPENDOUS MASSY ROLE COMING THIS SANKRANTHI 2023 SR

Vaishnav Tej :పంజా వైష్ణవ్ తేజ్ ఊరమాస్ అప్ డేట్.. సంక్రాంతి రిలీజ్.. అధికారిక ప్రకటన

Panja Vaisshnav Tej New Movie Photo : Twitter

Panja Vaisshnav Tej New Movie Photo : Twitter

Vaishnav Tej :వైష్ణవ్ మరో సినిమాను ఓకే చేశారు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్‌ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా విషయంలో తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మొదటి చిత్రం నుంచి కొత్త సబ్జెక్టు‌లనే ఎంచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు పూర్తి మాస్ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు.

ఇంకా చదవండి ...
    మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. వైష్ణవ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga).. అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకునివిడుదలకు రెడీ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మరో సినిమాను ఓకే చేశారు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్‌ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా విషయంలో తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మొదటి చిత్రం నుంచి కొత్త సబ్జెక్టు‌లనే ఎంచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు పూర్తి మాస్ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు.

    వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో నాల్గవ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్‌లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్సమెంట్ టీజర్ మాత్రం మాత్రం ఓ రేంజ్‌లో ఉందని, డైలాగ్స్ అదిరిపోయాయని అంటున్నారు నెటిజన్స్. ఈ ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుందని ప్రకటించారు. ఇక మరోవైపు వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఓ కొత్త సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.


    ఇక వైష్ణవ్ రంగరంగ వైభవంగా సినిమా విషయానికి వస్తే.. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha) ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇవి పోస్ట్-థియేట్రికల్ OTT హక్కులని గమనించగలరు. సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్. 'కొత్తగా లేదేంటి .. కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి' అంటూ సాగుతోన్న పాట ఆకట్టుకుంటోంది. రొమాంటిక్‌గా సాగుతోన్న పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అర్మాన్ మాలిక్, హరిప్రియ పాడగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు.

    ఇక ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. తెలుసా తెలుసా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా.. శంకర్ మహాదేవన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ (Ranga Ranga Vaibhavanga ).. సినిమాకు గీరిషయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ (Ketika sharma) కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.

    వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొండపొలం విషయానికి వస్తే.. ర‌వీంద్రనాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వస్తాడు. ఎంత ప్ర‌య‌త్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్‌.ఎస్‌ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news, Vaishnav tej, Vaisshnav Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు