Uppena Dhak Dhak Dhak: వైష్ణవ్ తేజ్ పాటలో మేనమామ చిరంజీవి..

Uppena movie: మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. ఉప్పెన సినిమాతో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ భారీగానే లాంచ్ అవుతున్నాడు. ఈయన కోసం మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 9, 2020, 7:52 PM IST
Uppena Dhak Dhak Dhak: వైష్ణవ్ తేజ్ పాటలో మేనమామ చిరంజీవి..
ఉప్పెన చిత్రంలోని ధక్ ధక్ ధక్ సాంగ్ పోస్టర్ (uppena movie poster)
  • Share this:
మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. ఉప్పెన సినిమాతో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ భారీగానే లాంచ్ అవుతున్నాడు. ఈయన కోసం మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు డబ్బులు పెడుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి తోడు బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కొత్త హీరో అయినా కూడా కథపై నమ్మకంతో 18 కోట్ల వరకు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన నీ కన్ను నీలిసముద్రం పాట మంచి హిట్ అయింది.

ఇక ఇప్పుడు మరో పాట కూడా విడుదలైంది. ఈ సారి వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ధక్ ధక్ ధక్ అంటూ సాగే ఈ పాటకు మంచి అప్లాజ్ వస్తుంది. వినగానే సూపర్ అనిపించే క్యాచీ ట్యూన్ ఇచ్చాడు దేవీ. అన్నట్లు ఈ సినిమా కోసం పారితోషికం కాకుండా వాటా తీసుకుంటున్నాడు దేవీ. ఈ క్రమంలో ఆయనకు దాదాపు 2.5 కోట్ల కంటే పైనే వస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌తో కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎప్రిల్ 2న ఉప్పెన విడుదల కానుంది. ఈ పాటలో చిరంజీవిని కూడా వాడేసుకున్నాడు మెగా మేనల్లుడు.
Published by: Praveen Kumar Vadla
First published: March 9, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading