Prabhas - Sridevi Soda Center: సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’కు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సపోర్ట్..

ప్రభాస్ సుధీర్ బాబు (Prabhas Sudheer Babu)

Prabhas - Sridevi Soda Center: సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు ప్రభాస్ (Prabhas - Sridevi Soda Center) అండదండగా ఉన్నాడు. ఆగస్ట్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపే సినిమా యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి తన బెస్ట్ విషెస్ తెలిపాడు ప్రభాస్.

  • Share this:
ఓ హీరో నటించిన సినిమాను మరో హీరో ప్రమోట్ చేయాలంటే మంచి మనసు ఉండాలి. అది ప్రభాస్‌కు కావాల్సినంత ఉంది. కొన్ని రోజులుగా ప్రభాస్ చిన్న సినిమాలతో పాటు కొత్త వాళ్లను కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జాతి రత్నాలు సినిమాను ప్రభాస్ ఎంత బాగా ప్రమోట్ చేసాడో అందరికీ తెలుసు. ఇప్పుడు సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా ప్రభాస్ అండదండగా ఉన్నాడు. విడుదలకు ముందు చిత్ర యూనిట్‌కు అంతకంటే గొప్ప బూస్టప్ మరోటి లేదు. ఆగస్ట్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోపే సినిమా యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి తన బెస్ట్ విషెస్ తెలిపాడు ప్రభాస్. శ్రీదేవి సోడార్ సెంటర్‌లో ఆనంది హీరోయిన్‌గా నటించింది. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి. ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు.
prabhas,prabhas twitter,prabhas sudheer babu,prabhas sridevi soda center,prabhas sridevi soda center promotion,prabhas sridevi soda center best wishes,ప్రభాస్,శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు ప్రభాస్ సపోర్ట్,సుధీర్ బాబు ప్రభాస్,ప్రభాస్ శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్
శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center)

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగా విడుదల చేయబోతున్నారు. ఈయన ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. మొత్తానికి ప్రభాస్ ఎంకరేజ్‌మెంట్‌తో శ్రీదేవి సోడా సెంటర్ టీమ్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లైంది.
Published by:Praveen Kumar Vadla
First published: