PAN INDIA WRITER VIJAYENDRA PRASAD PREPARING A POWERFUL STORY FOR PAWAN KALYAN MHN
Pawan Kalyan - Vijayendra Prasad: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కోసం స్టార్ రైటర్ కథ.. డైరెక్టర్ ఎవరంటే..?
Pan India writer Vijayendra prasad preparing a powerful story for Pawan kalyan
Pawan Kalyan - Vijayendra Prasad: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ కథను తయారు చేస్తున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వకీల్‌సాబ్‌ను పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న హరిహర వీరమల్లు (వినిపిస్తున్న టైటిల్) సినిమాతో పాటు , మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ సమాచారం మేరకు పాన్ ఇండియా రైటర్‌గా పేరున్న విజయేంద్ర ప్రసాద్ పవన్‌కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథను తయారు చేస్తున్నాడట.
అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. సాధారణంగా రాజమౌళి సినిమాలకు కథలను అందించడంతో పాటు.. ఇతర దర్శకులకు కూడా కథలు అందిస్తుంటాడు. బజరంగీ భాయ్‌జాన్, తలైవి వంటి పలు చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. పవన్ ..సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్ సినిమాలకు కాకుండా నెక్ట్స్ చేయబోయే సినిమాలకు కథను అందించేలా విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ చేసుకున్నాడు.
Pan India writer Vijayendra prasad preparing a powerful story for Pawan kalyan
పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేకంగా అభిమానించే విజయేంద్రప్రసాద్.. బాహుబలి ఇంటర్వెల్ సీక్వెల్‌ను పవన్‌కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే తయారు చేసుకున్నానని విజయేంద్రప్రసాద్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ కోసమే కథను తయారు చేస్తున్నాడు కాబట్టి, తన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కథను తయారు చేస్తాడో చూడాలి మరి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.