ఇదేంటి కొత్త కన్ఫ్యూజన్. దొరక్క దొరక్క డార్లింగ్‌కి ఇన్నాళ్లకు ఓ సీత దొరికితే, ఇప్పుడు ఉన్నపళాన ఆమె సీత కాదు.. కరీనా కపూరే సీత అని రాస్తున్నారేంటి? అని అనుకోకండి. డీటైల్స్ అన్నీ డీటైల్డ్ గా ఈ ఆర్టికల్‌లో రాస్తాను చదివేయండి. రౌత్ డైరక్షన్లో టీసీరీస్ చేస్తున్న సినిమాలో సీత కృతిసననే. ప్రభాస్ హీరోగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న ఆదిపురుష్‌లో ముమ్మాటికి సీత కేరక్టర్ చేస్తున్నది కృతిసననే. ఇప్పటికే తెలుగులో సుకుమార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్‌కి తెలుగు హీరోలతో పనిచేయడం కొత్తేం కాదు. పైగా ఆదిపురుష్‌ని తెలుగు సినిమా అనడానికి కూడా లేదు. పక్కా ప్యాన్ ఇండియా సినిమా. నార్త్ డైరక్టర్. ఒక్క ప్రభాస్ తప్ప మిగిలిన వాళ్లందరూ నార్త్ వాళ్లే. సో అక్కడ కృతికి వచ్చిన ఇబ్బందేమీ లేదు.
మరి కరీనా కపూర్ సంగతేంటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. కరీనాకపూర్ కూడా సీత కేరక్టరే చేస్తోంది. కానీ ప్రభాస్ సినిమాలో కాదు. ఆమె కోసం రాజమౌళి కాంపౌండ్‌లో కథ రెడీ అవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ సీత కథను కరీనా కోసం సిద్ధం చేస్తున్నారట. అలౌకిక్ దేశాయ్ నెక్స్ట్ చేసే సినిమా అదేనట. అందులోనే కరీనా సీత కేరక్టర్ పోషిస్తుంది.
ఇప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన కరీనా ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈ కేరక్టర్ కోసం ప్రిపేర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌తో సత్సంబంధాలు కలిగి ఉంది రాజమౌళి ఫ్యామిలీ. కరణ్ జోహార్ వర్గంతో రాజమౌళి క్లోజ్‌గా ఉంటే, కంగనా రనౌత్‌తో విజయేంద్రప్రసాద్ మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు కరీనా కపూర్ ఫ్యామిలీతోనూ రాజమౌళి కాంపౌండ్‌కి మంచి అసోసియేషన్ ఏర్పడనుంది. త్వరలోనే హాలీవుడ్ రేంజ్ స్క్రిప్ట్ చేయాలన్నది విజయేంద్రప్రసాద్ కల అట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kareena Kapoor, Prabhas