Prabhas - Salaar: ‘సలార్’ సెట్స్‌లోకి ప్రభాస్ అడుగులు.. బాక్సాఫీస్ రికార్డుల కోసం క్రేజీ డేట్‌ను లాక్ చేశారుగా..!

Pan india star Prabhas Salaar Locks up A Crazy release date latest update here

Prabhas - Salaar: ప్రతి సినిమాకు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న స్టార్ హీరో ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రేజీ టైమ్‌లో ఈ చిత్రాన్ని తీసుకు రావడానికి ప్లానింగ్ జరిగింది.

  • Share this:
    రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. త‌ర్వాత చేసిన సాహో ద‌క్షిణాదిన ఆశించిన స్థాయిలో హిట్ కాక‌పోయినా.. ఉత్త‌రాదిన మాత్రం ప్ర‌భాస్ మార్కెట్ రేంజ్‌ను త‌గ్గించ‌కుండా కంటిన్యూ చేసింది. తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాల‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే.. ప్ర‌భాస్ త‌దుప‌రి ప్యాన్ ఇండియా మూవీ ‘సలార్’ను స్టార్ట్ చేసేశాడు.

    ‘స‌లార్’ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి 29 నుంచి స్టార్ట్ అవుతుందట‌. తొలి షెడ్యూల్ నుంచే ప్ర‌భాస్ షూటింగ్‌లో పాల్గొంటాడ‌ట‌. ‘కేజీయ‌ఫ్ ఛాప‌ర్ట్‌1’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ కోసం అంద‌రినీ ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ‘సలార్’ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుందని సమాచారం.

    కాగా.. ‘సలార్’ సినిమా రిలీజ్ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. సినిమాకు ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండా ప‌క్కా ప్లానింగ్‌తో వెళ్లాల‌ని రూఢీ చేసుకున్నారు. అంతా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే 2022 సంక్రాంతి బ‌రిలోకి ‘స‌లార్’ దిగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా సంక్రాంతి అని నిర్ణ‌యించుకోవ‌డానికి కార‌ణం.. వ‌రుసగా సెల‌వులు ఉండ‌టంతో వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు క్రియేట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేద‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ నాలుగు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించాడు. అంటే ఈ ఏడాది ప్ర‌థమార్థంలోపు షూటింగ్ పూర్త‌యినా, విఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం తీసుకున్నా.. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి దింపి బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తాను చాటాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
    Published by:Anil
    First published: