హోమ్ /వార్తలు /సినిమా /

RRR - NTR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సన్నివేశాలు చూస్తే అభిమానులు తట్టుకోలేరంటున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

RRR - NTR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సన్నివేశాలు చూస్తే అభిమానులు తట్టుకోలేరంటున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

RRR - NTR

RRR - NTR

RRR - NTR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో మల్టీ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు.

ఇంకా చదవండి ...

RRR - NTR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో మల్టీ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కనుంది. ఇక ఇందులో స్వతంత్ర పోరాట యోధుల పాత్రల్లో చెర్రీ, తారక్ కనిపించనున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకోనున్నారు. ఇక వీరి లుక్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ ఇదివరకే విడుదల కాగా మరింత ఆసక్తిగా అనిపించడంతో.. ఈ సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఐరిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ఏదో ఒక అప్ డేట్ అందిస్తూనే ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తారక్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకులు సీట్లో కూర్చోలేరంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక భారీ సెట్టింగ్ తో సినిమా మరోలా ఉంటుందని తెలిపాడు తారక్. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టివెన్ సన్, అలిసన్ డోడీ వంటి పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయడానికి ముందుగా ప్లాన్ చేయగా.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

First published:

Tags: Alia bhat, NTR, Pan india film, Rajamouli, Ram Charan, Rrr fight sceans, ఆర్ఆర్ఆర్‌, ఎన్టీఆర్, కొమురం భీం, సీతారామరాజు

ఉత్తమ కథలు