• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAN INDIA FILM RADHE SHYAM POOJA HEGDE CHARECTER LEAKED IN INTERNET GOES VIRAL NR

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏంటో తెలుసా?

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఏంటో తెలుసా?

Pooja Hegde

Radhe Shyam: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ దూసుకుపోతుంది.

  • Share this:
    Radhe Shyam: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ దూసుకుపోతుంది. ఇటీవలే అలా వైకుంఠపురంలో లో సినిమాలో హీరో అల్లు అర్జున్ సరసన నటించి.. బుట్ట బొమ్మ గా పేరు ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకుంటుంది.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రొమాంటిక్ పీరియాడికల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది. యువి క్రియేషన్స్, టీ సీరీస్ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అవగా.. అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇందులో పూజా హెగ్డే పాత్ర గురించి తాజా అప్ డేట్ రాగా.. పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో మెడికోగా చేస్తుందట.

    ఈ సినిమాలో లో ప్రభాస్ ప్రమాదం లో చిక్కుకోగా.. వహ్ ఆస్పత్రిలో చేరుతాడట. ఇక ఆ సమయంలో అక్కడున్న పూజా హెగ్డే ను చూడగా వీరి మధ్య పరిచయం పెరుగుతుందని వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాలో కృష్ణంరాజు, మురళి శర్మ, ప్రియదర్శి, కునాల్ కపూర్ పలు పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తుందట. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జులై 30న విడుదల కానుందని సినీ బృందం తెలిపారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య, బాలీవుడ్ లో సర్కస్, తమిళంలో మరో సినిమాతో.. వరుసగా నటిస్తుంది.
    Published by:Navya Reddy
    First published: