Pallavi Joshi: బాలీవుడ్ నటి పల్లవి జోషి.. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ‘వాక్సిన్ వార్’ సినిమా షూటింగ్‌లో పల్లవి జోషి గాయపడ్డారు. షూటింగ్ జరుగుతున్న సయమంలో పక్కన ఉన్న వాహనం అదుపుతప్పి ఢీ కొనడంతో పల్లవి జోషికి గాయలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటినా దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పటిల్‌కు తరలించిన చిత్ర బృందం. ఈమె ప్రముఖ దర్శకుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘ది వాక్సిన్ వార్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య. గతేడాది విడుదలైన భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలనటిగా చిత్ర రంగంలో ప్రవేశించిన పల్లవి జోషి.. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మృగనయినీ’ భారత్ ఏక్ కోజ్’, ఆరోహణ్, మిస్టర్ యోగి వంటి సీరియల్స్‌తో అప్పటి ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే.
అటు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూనే సినిమాల్లో నటించింది. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్‌గా.. హీరో చెల్లెలు పాత్రల్లో ఎక్కువగా నటించింది. ఈమె హిందీతో పాటు మాతృ భాష మరాఠీతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. 1997లో ఈమె ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని పెళ్లి చేసుకుంది. ఇక ఈయన తెరకెక్కించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’, సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించింది. ఇపుడు మరోసారి తన భర్త దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది వాక్సిన్ వార్’ మూవీలో ముఖ్యపాత్రల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే పల్లవి జోషి గాయపడింది. ఈమె నటిగా ఉంటూ రచయతగా, నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. 2019లో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ చిత్రంలోని నటనకు ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డును అందుకుంది.
ప్రస్తుతం ఈమె నటిస్తోన్న ‘ది వాక్సిన్ వార్’ సినిమా విషయానికొస్తే.. కరోనా ఉదృతి సమయంలో మన దేశం కరోనా వాక్సిన్‌ను కనుగొనడంతో పాటు అందరికీ సరైన సమయంలో అందుబాటులోకి తీసుకోవడంతో మన దేశం బతికి బట్టకట్టింది. అంతేకాదు మన దేశంలో తయారైన వాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసారు.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను మన దేశ శాస్త్రజ్ఞులతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో అభినందించాలి.మొత్తంగా ఈ వాక్సిన్ తయారు చేసినా.. మార్కెట్‌లోకి రాకుండా అంతర్జాతీయంగా జరిగిన కుట్రలను ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. మరోవైపు మన దేశంలో వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ఇతర రాజకీయ పక్షాలు చేసిన నానా యాగీని కూడా ఇందులో చూపించే అవకాశాలున్నాయి. మొత్తంగా వ్యాక్సిన్ పై ప్రజల్లో చేసిన దుష్ప్రచారాన్నిసైతం తట్టుకొని ప్రజలు స్వచ్ఛదంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో పాటు మొత్తంగా 11 భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
’ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ఒకప్పటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని కొందరు అంటుంటే.. అబద్ధపు చరిత్రకు తెరరూపం ఇచ్చారంటూ మరికొందరు విమర్శించారు. అయితే ఎవరేమన్నా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Pallavi Joshi, The Vaccine War, Tollywood, Vivek Ranjan Agnihotri