రివ్యూ : పక్కా కమర్షియల్
నటీనటులు : గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్,అజయ్ ఘోష్, సప్తగిరి వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు..
ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్
సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా
సంగీతం: జెేక్స్ బిజోయ్
నిర్మాతలు : గీతా ఆర్ట్స్స్ 2 , యూవీ క్రియేషన్స్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి విడుదల తేది : 1/7/2022
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. పేరు తగ్గట్టే ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ రోజు విడుదలైన పక్కా కమర్షియల్ నిజంగా కమర్షియల్‌గా హిట్ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సూర్య నారాయణ (సత్యరాజ్) సెషెన్స్ కోర్ట్ జడ్జ్. నిజాయితీ మారు పేరు. ఈయన దగ్గరకు వచ్చిన ఓ కేసులో సాక్ష్యాధారాల ఆధారంగా ఒక అమాయకురాలైన అమ్మాయికి శిక్ష విధించాల్సి వస్తోంది. ఈ సందర్భంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటోంది. దీని కంతటి కారణం వివేక్ (రావు రమేస్) అనే పారిశ్రామికవేత్త.
తన మూలంగా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంలో జడ్జ్ పదవికి రాజీనామా చేస్తాడు. న్యాయవాది ఎంతో నిజాయితీగా ఉండే ఇతని కుమారుడు లక్కీ (గోపీచంద్) మాత్రం లాయర్.. ప్రతి దాన్ని డబ్బు కోణంలోనే చూస్తాడు. ఈ నేపథ్యంలో హీరో, తండ్రికి జరిగే ఘర్షణలో .. హీరో ఏమి చేసాడనేదే ‘పక్కా కమర్షియల్’ సినిమా.
కథ, కథనాల విషయాలకొస్తే..
మారుతి .. పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టి.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్ చెప్పారు. తెలుగు సహా ఇతర ఇండస్ట్రీలో తెరకెక్కిన చాలా చిత్రాలు ఇలాంటి పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కినవే కావడంతో నెక్ట్స్ సీన్.. ఏముంటుందో ఆడియన్స్ పసిగట్టేస్తారు. ముఖ్యంగా మారుతి రొటీన్ కథ, కథనాలతోనే పక్కా కమర్షియల్ అనే సినిమాను గట్టెక్కించే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తుంటే.. టెంపర్ సినిమాలో అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్.. ఎలా నిజాయితీ పరుడుగా మారాడనేది చూపించారు. ఇందులో కూడా ఇంచు మించు అదే ఫార్మాట్ ఉపయోగించాడు.దాంతో పాటు పోకిరి, నాన్నకు ప్రేమతో సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. మారుతి ఈ సినిమా తన తొలి రోజుల్లో చేసిన బూతు చిత్రాల తాలూకు ఛాయలు ఎక్కువగా కనిపించాయి. విలన్ చెప్పే కొన్ని డైలాగులు వల్గర్‌గా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. మారుతి దర్శకత్వంలో ఇవివి తాలుకు ఛాయలు కనిపిస్తాయి. హీరో కూడా లా పాయింట్స్ ఆధారంగా విలన్స్‌ను ముప్పతిప్పలు పెడతాడా అంటే పూర్తిగా అదిలేదు. స్టార్టింగ్‌లో హీరో లాయర్ తెలివి తేటలు చూపించారు. ఇక విలన్ ఒక అమ్మాయి ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం లాంటివి లాజిక్‌గా దూరంగా ఉంది. ఆ తర్వాత అంతా రొటీన్ ఫార్మాట్. మొత్తంగా మారుతి ఫస్ట్ హాఫ్.. లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ కాస్త బెటర్‌గా తెరకెక్కించాడు. సినిమా అంటేనే లాజిక్‌కు అందనంత దూరంలో తెరెక్కిస్తారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. అది కరెక్ట్ అనిపిస్తోంది.
మొత్తంగా పాత కమర్షియల్ ఫార్మాట్‌లోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక జేక్స్ బిజోయ్ అందించిన పాటలు ఏమంత క్యాచీగా లేవు. టైటిల్ సాంగ్ ఒక్కటే బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
గోపీచంద్ .. ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కన్నింగ్ లాయర్ పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించాడు. రెగ్యులర్ కమర్షియల్ హీరో బ్యాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు నటించి మెప్పించాడు. రాశీ ఖన్నా.. లాయర్ ఝాన్సీ అంటూ నవ్వించే ప్రయత్నం చేసింది. ఇంటర్వెట్ వరకు ఈ పాత్ర ఉన్న.. ఆ తర్వాత క్లైమాక్స్ వరకు కనిపించదు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. విలన్‌గా నటించిన రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పించాల్సిన పనిలేదు. అజయ్ ఘోష్ కూడా తనదైన విలనిజంతో నవ్వించాడు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల పర్ఫామెన్స్..
కెమెరా వర్క్
క్లైమాక్స్ సీన్
మైనస్ పాయింట్స్
రొటిన్ కమర్షియల్ స్టోరీ
మ్యూజిక్
లాజిక్‌కు అందని సన్నివేశాలు
చివరి మాట : పక్కా కమర్షియల్ టైటిల్‌కు తగ్గట్టు పక్కా కమర్షియల్ మూవీ..
రేటింగ్ 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gopichand, Pakka Commercial, Raashi Khanna, Tollywood