ప్రధాని మోదీని సుసైడ్ జాకెట్‌తో బెదిరించిన పాక్ సింగర్.. ఆడుకున్న నెటిజన్స్..

ఇండియాపై పాకిస్తాన్ ఎప్పుడూ నిప్పులు గక్కుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి అక్కడి ఉగ్రవాద ధోరణి బయటపడింది. తాజాగా వివాదాస్పద గాయని రబ్బీ పిర్జాదా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 23, 2019, 3:10 PM IST
ప్రధాని మోదీని సుసైడ్ జాకెట్‌తో బెదిరించిన పాక్ సింగర్.. ఆడుకున్న నెటిజన్స్..
పాకిస్తాన్ సింగర్ రబీ, నరేంద్ర మోదీ
  • Share this:
ఇండియాపై పాకిస్తాన్ ఎప్పుడూ నిప్పులు గక్కుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి అక్కడి ఉగ్రవాద ధోరణి బయటపడింది. తాజాగా వివాదాస్పద గాయని రబ్బీ పిర్జాదా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఎప్పుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో ఉంటుంది. పైగా భారత్‌ను టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఎప్పటికప్పుడు వివాదాస్పద కమెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన పోస్ట్ పెట్టింది. అసభ్య పదజాలాన్ని వాడుతూ బెదిరించే ప్రయత్నం చేసింది. అయితే అది ఆమెకే తిప్పి కొట్టారు నెటిజన్స్. ప్రస్తుతం రబ్బీతో నెటిజన్స్ రగ్బీ ఆడుకుంటున్నారు.మా దేశాన్ని.. మా ప్రధానిని బెదిరించేంత దమ్ముందా నీకు అంటూ ఆడేసుకుంటున్నారు. ఆత్మాహుతి బాంబర్ జాకెట్ ధరించి మోదీ కోసమే అంటూ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇది మీ పాకిస్తాన్ యూనిఫామా అంటూ రబ్బీకి కౌంటర్స్ వేస్తున్నారు. భారత ప్రధాని మోదీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చింది రబ్బీ. ఈమె వ్యాఖ్యలు.. చేసిన చేష్టలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ భారత్‌ను బెదిరించే ఫన్నీ చేష్టలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ పాకిస్తాన్ సింగర్. మొత్తానికి మరోసారి అలా చేయబోయి నవ్వుల పాలైపోయింది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...