విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రముఖ మోడల్..

పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: May 23, 2020, 8:58 AM IST
విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రముఖ మోడల్..
జారా అబిడ్ Photo : Instagram
  • Share this:
పాకిస్తాన్‌లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా పాక్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించార్న విషయంలో స్పష్టత లేదు. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గురైన విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్నీ ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పాకిస్తాన్ మోడల్ జారా అబిడ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading