Home /News /movies /

PAGA PAGA PAGA MOVIE REVIEW MUSIC DIRECTOR KOTI ACTION DRAMA TA

Paga Paga Paga Movie Review: ‘పగ పగ పగ’ మూవీ రివ్యూ.. కమర్షియల్ రివేంజ్ డ్రామా..

పగ పగ పగ మూవీ రివ్యూ (Twitter/Photo)

పగ పగ పగ మూవీ రివ్యూ (Twitter/Photo)

Paga Paga Paga Movie Review: టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా నటించిన సినిమా ‘పగ పగ పగ’. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 22న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సినిమాలో నటుడిగా కోటి ఎలా ఉన్నాడు..? ఇవన్నీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
రివ్యూ : పగ పగ పగ నటీనటులు : అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య, కోటి, బెనర్జీ తదితరులు ఎడిటర్: పాపారావు సినిమాటోగ్రఫర్: నవీన్ కుమార్ చెల్లా నిర్మాత: సత్య నారాయణ సుంకర దర్శకత్వం: రవి శ్రీ దుర్గా ప్రసాద్ సంగీతం: కోటి విడుదల తేదీ: 22/09/22 టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా నటించిన సినిమా ‘పగ పగ పగ’. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 22న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సినిమాలో నటుడిగా కోటి ఎలా ఉన్నాడు..? ఇవన్నీ రివ్యూలో చూద్దాం.. కథ: బెజ్జోని పేటలో ఒక్కసారి డీల్ కుదిరితే చచ్చినా పని చేసి చస్తారు. జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) సెటిల్మెంట్ చేస్తూ హత్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్‌ను చంపిన కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. అదే సమయంలో జగ్గూకి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) జన్మిస్తుంది. అరెస్ట్ అయిన కృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన మాటను మరిచిపోతాడు జగ్గూ. ఆ తర్వాత కాలంలో జగ్గూ బాగా ఎదుగుతాడు.. జగ్గూ కాస్తా జగదీష్ ప్రసాద్‌గా మారతాడు. మరోవైపు ఇచ్చిన మాట మరవడంతో.. కృష్ణ ఫ్యామిలీ కష్టాలు పడుతూనే ఉంటుంది. అదే కష్టాల్లోంచి కృష్ణ కొడుకు అభి (అభిలాష్) కష్టపడి చదువుతుంటాడు. చిన్నతనం నుంచే అభిని ఇష్టపడుతుంది జగ్గూ కూతురు సిరి. కానీ ఈ విషయం జగదీష్ ప్రసాద్‌కు నచ్చదు. కోపంతో తన అల్లుడిని చంపేందుకు ఓ డీల్ మాట్లాడతాడు. కానీ తెల్లాసేసరికి మనసు మార్చుకుంటాడు. అయితే అంతలోపే అల్లుడిని చంపే డీల్ కాస్తా.. మాట మార్చని బెజ్జోని పేట వ్యక్తికి చేరుతుంది.. ఆ తర్వాత ఏమైంది.. అల్లుడిని కాపాడుకోడానికి జగ్గూ ఏం చేసారు అనేది అసలు కథ.. కథనం, టెక్నికల్ టీం: ఈ మధ్య చాలా సినిమాలు 80ల నేఫథ్యంలోనే వస్తున్నాయి. దర్శకులు రాసుకుంటున్న కథలన్నీ అక్కడే తిరుగుతున్నాయి. తాజాగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ కూడా ఈ నేపథ్యంలోనే రాసుకున్నాడు పగ పగ పగ కథ. రొటీన్ కమర్షియల్ కోణంలోనే సాగే ఈ సినిమాకు దర్శకుడు ఎంచుకున్న నేపథ్యమే కొత్తగా అనిపించింది. ఈ పాయింట్ పాతదే అయినా ట్రీట్ మెంట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. 1985లోనే ఈ సినిమా సాగుతుంది. అయితే దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా.. అది స్క్రీన్ మీదకు వచ్చేసరికి కాస్త స్లో అయింది. తాను అనుకున్న రివేంజ్ ఫార్ములాను కామన్ ఆడియన్‌కు కనెక్ట్ చేయడంలో మాత్రం దర్శకుడు రవి కాస్త తడబడినట్లు అర్థమవుతుంది. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా వెళ్లిపోతుంది. పైగా కోటి, బెనర్జీ ఎపిసోడ్ కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో పోకిరి సీన్‌ను ఇందులో వాడుకున్న తీరు బాగుంటుంది. ఈ కథకు పోకిరి సీన్ లింక్ చేయడం బాగుంది. మెయిన్ స్టోరీ అంతా సెకండాఫ్‌లోనే ఉంచాడు దర్శకుడు. కాలేజ్ ఎపిసోడ్స్ కాస్త సరదాగా సాగుతుంటాయి. అల్లుడిని చంపడానికి కోటి తీసుకునే నిర్ణయం.. ఆ వెంటనే మళ్లీ అదే అల్లుడిని కాపాడుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటాయి. ద్వితీయార్థంలో కిల్లర్‌ను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా మారుతాయి. ఇక చివర్లో క్లైమాక్స్ కూడా అందిరినీ ఆశ్చర్యపరుస్తుంది. పగ పగ పగ అనే టైటిల్‌ దర్శకుడు ఎందుకు పెట్టాడో అర్థమవుతుంది. క్లైమాక్స్ కాస్త కొత్తగా ప్రయత్నించారు. రొటీన్ రివేంజ్ స్టోరీలా కాకుండా సరదాగా ట్రై చేసారు. కోటి నటుడిగానే కాకుండా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ట్యూన్స్ అంతగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ వీక్.. సెకండాఫ్ బాగా కట్ చేసారు. సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతుంది ఈ చిత్రానికి. నాటి పరిస్థితులు చాలా బాగా స్క్రీన్ మీద చూపించారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్లు బాగానే ఖర్చు చేసారు. దర్శకుడిగా రవి శ్రీ దుర్గాప్రసాద్ తన వంతు బాగానే ప్రయత్నించాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలోనూ తడబడ్డాడు. తను రాసుకున్న కథకు నేపథ్యం బాగానే తీసుకున్నా.. దాన్ని అనుకున్నట్లుగా తెరపై చూపించలేకపోయాడు. ఉన్నంతలో రివేంజ్ కథను 60 శాతం సక్సెస్ ఫుల్‌గా చూపించాడు. నటీనటుల విషయానికొస్తే..  1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన కోటి.. తొలిసారి నటుడిగా మారారు. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. పైగా అది కూడా విలన్‌గా అదరగొట్టేశాడు. ఈయన ఫేస్ చూసి విలన్‌గా ఏం చేస్తాడులే అనుకుంటారు కానీ కోటి మాత్రం స్క్రీన్‌పై చాలా బాగున్నాడు. హీరోగా మొదటి సినిమానే అయినా అభిలాష్ ఉన్నంతలో చాలా బాగా కనిపించాడు.. ప్రేక్షకులను మెప్పిస్తాడు కూడా. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అభిలాష్ ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక పర్లేదనిపించింది. సీనియర్ నటుడు బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా అంతా ఓకే అనిపించారు. ప్లస్ పాయింట్స్: కోటి నటన 1980 నేపథ్యం నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సంగీతం చివరగా ఒక్కమాట: పగ పగ పగ.. రివేంజ్ డ్రామా విత్ డిఫెరెంట్ క్లైమాక్స్.. రేటింగ్: 2.5/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Koti, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు