Home /News /movies /

PADMA SHRI FOR SENIOR TOLLYWOOD ACTOR SATYANARAYANA PAWAN KALYAN DEMAND FOR CENTRAL GOVERNMENT TA

సీనియర్ నటుడు సత్యనారాయణకు పద్మశ్రీ.. కేంద్రానికి పవన్ కళ్యాణ్ డిమాండ్..

సత్యనారాయణకు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ (Twitter/Photo)

సత్యనారాయణకు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ (Twitter/Photo)

తెలుగులో తన విలక్షణ పాత్రలతో నవరస నటన సార్వభౌమ సత్యనారాయణకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా డిమాండ్ చేసారు.

    తెలుగులో తన విలక్షణ పాత్రలతో నవరస నటన సార్వభౌమ సత్యనారాయణకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగులో ఎన్నో పౌరాణికి, జానపద, సాంఘిక.చారిత్రక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన సత్యా నారాయణ తెలుగు నేలపై పుట్టడం మన అదృష్టమన్నారు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంలో సత్యనారాయణ గారు కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పవన్  గుర్తు చేసారు. అంతేకాదు నటుడిగానే కాకుండా నిర్మాతగా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగి ఎందరో ఔత్సాహిక కళాకారులకు ఆదర్శంగా నిలిచారు.  మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. అంతేకాదు ఆయన కలిసినపుడల్లా ఎంతో వాత్సల్యంతో మాట్లాడేవారని గుర్తు చేసారు.


    ఇక సత్యనారాయణ గారు మచిలీపట్నం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ని కలిసిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు పవన్. నటన పరంగా ఎంతో ఉన్నతంగా ఎదిగిన సత్యనారాయణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు రానందుకు ఆయన అభిమానులు శ్రేయోభిలాషులతో పాటు వ్యక్తిగతంగా నాకు ఎంతో బాధగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సత్యనారాయణకు పద్మశ్రీ బిరుదు వచ్చేలా  కృషి చేయాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా విజ్ఞప్తి చేసారు పవన్ కళ్యాణ్.  సత్యనారాయణ పూర్తి ఆరోగ్యంతో  నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఆయనకు దేవుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Central Government, Kaikala Satyanarayana, Padma Shri, Pawan kalyan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు