హోమ్ /వార్తలు /సినిమా /

Padma Awards.. రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి..

Padma Awards.. రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి..

రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి

రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి

Padma awards | తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ం శనివారం రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ అవార్డులను పలువురు ప్రముఖులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా సిరివెన్నల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్బంగా కేంద్రం విభిన్న రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది. ఈ జాబితాలో తెలుగు చలన చిత్ర  రంగం నుండి  నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ తో  కేంద్రం సత్కరించింది. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ం శనివారం రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ అవార్డులను పలువురు ప్రముఖులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా సిరివెన్నల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.  సిరివెన్నెల విషయానికొస్తే పదాలతో ప్రయోగాలు చేయడం  సీతారామ శాస్త్రికి పెన్నుతో పెట్టిన విద్య. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను  సృష్టించాడు.  తన పాటలతో అక్షర సేద్యం చేసే కవి కర్షకుడు. చిన్నచిన్న పదాలతో అనితర సాధ్యమైన సాహిత్యం.. ఆయనకే చెల్లింది.  తెలుగు సినిమా యవనికపై సాహితీ సిరివెన్నెల కురిపించాడు సిరివెన్నెల.


80లలో కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ సినిమాతో పాటల రచయతగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఇప్పటికే వెండితెరపై ఆయన పదాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తొలిసినిమాతోనే సిరివెన్నెల ఇంటికి శివుని వాహనం ‘నంది’ అవార్డు రూపంలో రంకెలేస్తూ వచ్చింది. తాజాగా ఆయన కీర్తి కిరీటంలో పద్మశ్రీ వచ్చి చేరింది.

First published:

Tags: National News, Padma Awards, President of India, Ramnath kovind, Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు