Padma Awards.. రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న మోహన్ లాల్..

Padma Awards | తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ం సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ నటుడు సూపర్ స్టార్  మోహన్ లాల్ రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 11, 2019, 1:41 PM IST
Padma Awards.. రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న మోహన్ లాల్..
రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న మోహన్ లాల్
  • Share this:
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్బంగా కేంద్రం విభిన్న రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది. ఈ జాబితాలో సినీ రంగం నుండి మోహన్ లాల్‌కు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో కేంద్రం సత్కరించింది. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ం సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మలయాళ నటుడు సూపర్ స్టార్  మోహన్ లాల్ రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. గతంలో 2001లో కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. మోహన్ లాల్ విషయానికొస్తే..మలయాళ, తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలో 300 పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు జాతీయ స్థాయిలో జ్యురీతో కలిపి ఉత్తమ నటుడిగా నాలుగు పురస్కారాలు అందుకున్నారు.  తెలుగులో ఆ మధ్య ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ మనుసులు దోచుకున్నాడు.

Mohan Lal Received Padma Bhushan Award From President of India Ramnath kovind News18
రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న మోహన్ లాల్


 
First published: March 11, 2019, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading