రిపబ్లిక్ డే సందర్బంగా ప్రతి ఏడాది కేంద్రం విభిన్న రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది విభిన్న రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, మరియు దర్శకుడిగా సత్తా చూపెట్టిన ప్రభుదేవాకు కేంద్రం పద్మశ్రీతో అవార్డుతో గౌరవించింది. తాజాగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డు పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా ప్రభుదేవా ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కార ప్రధానోత్సవానికిీ ప్రభుదేవా సంప్రదాయ పంచెకట్టులో రావడం అందరినీ ఆకట్టుకుంది. సినీ రంగంలో మూడు విభిన్న రంగాల్లో సత్తా చూపెట్టిన ప్రభుదేవా ముందుగా కొరియోగ్రాఫర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టి..ఆ తర్వాత నటుడిగా మారి ఆపై దర్శకుడిగా సత్తా చూపెట్టాడు. ఒకవైపు దర్శకుడిగా ఉంటూనే నృత్య దర్శకుడిగా..అపుడపుడు నటుడిగా తన సత్తా చూపెడుతూనే ఉన్నాడు. భారతీయ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా తన 25 యేళ్ల లాంగ్ కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన నృత్య శైలులను తెరపై ఆవిష్కరించారు.
ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 13 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తానికి ప్రభుదేవా పద్మశ్రీ అవార్డు అందుకోవడం చేసి ఆయన అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ గాయకుడు కమ్ సినీ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ కూడా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
మరోవైపు తన డ్రమ్స్ వాయిద్యంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శివమణి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Padma Awards, Prabhu deva, President of India, Ramnath kovind, Tamil Cinema, Telugu Cinema, Tollywood