PADMA AWARDS 2022 FOLK SINGER DARSHANAM MOGULAIAH ALONG WITH SHAVUKARU JANAKI AND SOU NIGAM TO BE CONFERRED WITH PADMASRI SR
Padma Awards 2022 : దర్శనం మొగిలయ్యకు, షావుకారు జానకికి పద్మశ్రీ..
Padma Awards 2022 Photo : Twitter
Padma Awards 2022: భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఈ అవార్డ్‌ల కోసం కొంతమందిని ఎంపిక చేస్తుంది.
Padma Awards 2022: భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఈ అవార్డ్‌ల కోసం కొంతమందిని ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా సినీ రంగంలో విశేష సేవలందించిన వారికి ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇక తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు ఈ పద్మశ్రీ అవార్డ్ వచ్చింది. దర్శనం మొగిలయ్య మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ కథలు చెప్పుతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటతో ఆయన మరింత మందికి చేరువైయ్యారు. ఇక సినీ రంగానికి చెందిన ప్రముఖుల్లో నటి షావుకారు జానకి, సింగర్ సోనూ నిగమ్, దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివేదీలకు పద్మశ్రీలు వరించాయి. షావుకారు జానకి విషయానికి వస్తే.. ఆమె ఎన్టీఆర్‌కు జోడిగా నటించిన మొదటి హీరోయిన్. అంతేకాదు దాదాపు మూడు వేల నాటకాలు, నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఇక ఇతర రంగాల్లో పద్మ అవార్డులు పొందిన వారి వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్‌ను పద్మవిభూషణ్ అవార్డు కోసం ఎంపిక చేసింది. ఆయనతో పాటు ప్రభ ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా(మరణానంతరం), యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్(మరణానంతరం)లకు పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి.
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఆజాద్‌తో పాటు మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. వీరిలో బెంగాల్‌కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్రకు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్, సైరస్ పూనావాలా, యూపీ నుంచి రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, తెలంగాణ నుంచి కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, రాజస్థాన్ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు సత్యా నాదేళ్ల, సుందర్ పిచాయ్, మెక్సికోకు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) ఉన్నారు.
Govt announces Padma Awards 2022
CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5
మరో 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మ భూషణ్ అవార్డులు రాగా.. గరికపాటి నరసింహారావు, పద్మజారెడ్డి, రామచంద్రయ్య, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్(మరణానంతరం) పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.