• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PACHCHIS MOVIE HEROINE SWETHA VARMA HOT COMMENTS ON CASTING COUCH IN TELUGU INDUSTRY NR

Swetha Varma: రూ.లక్ష ఇచ్చి కమిట్‌మెంట్ అడిగారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

swetha varma

Swetha Varma: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవకాశాల కోసం మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కానీ కొందరు తమ కెరీర్ కోసం వాటికి లొంగిపోవాల్సి వస్తుంది. మరికొందరు వాటిని మొదటికే దరికి చేరనీయరు.

  • Share this:
    Swetha Varma: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అవకాశాల కోసం మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కానీ కొందరు తమ కెరీర్ కోసం వాటికి లొంగిపోవాల్సి వస్తుంది. మరికొందరు వాటిని మొదటికే దరికి చేరనీయరు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ ఇలాంటివి ఎదుర్కొనే ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పుకుంటే.. మరికొంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెప్పుకోలేకపోతారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో నిజానికి తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు అంతగా ఉండవు. ఇప్పటివరకు తెలుగులో కొంతమంది తెలుగు అమ్మాయిలు పరిచయము కాగా కేవలం రెండు మూడు సినిమాల వరకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు తెలుపుతూ.. తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి బయట పెట్టింది.

    పచ్చీస్ సినిమాతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన తెలుగు అమ్మాయి శ్వేతా వర్మ. కానీ ఈ హీరోయిన్ టాలీవుడ్ లో అంతగా రాణించలేక పోయింది. ఇక ఈమె తాజాగా కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా పంచుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం హిందీ వచ్చిన వాళ్ళని మాత్రమే హీరోయిన్లుగా తీసుకుంటారని, కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం తెలుగు రాని వాళ్లను కూడా తీసుకుంటారని తెలిపింది.

    తెలుగు హీరోయిన్ లకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరని, పైగా అవకాశాలు కూడా చాలా తక్కువగా వస్తాయని తెలిపింది శ్వేతా వర్మ. అంతేకాకుండా ఇప్పటికి కూడా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంది. ఇక తనకు గతంలో ఓ చేదు అనుభవం ఎదురయిందని తెలిపింది. తను షార్ట్ ఫిలిం చేస్తున్న సమయంలో కొందరు తనను కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారట. ఇక ఆ సమయంలో తను ఏదైనా ప్రాజెక్టు కోసం అడుగుతున్నారని అనుకుందట.

    swetha varma
    swetha varma


    కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదని అర్థం చేసుకుందట. ఇప్పటికీ వాళ్లు మాట్లాడిన మాటల స్క్రీన్ షాట్ లు కూడా ఉన్నాయని తెలిపింది. తనను 2015 లో యాడ్స్ కోసం సంప్రదించారని.. లక్ష రూపాయలు ఇస్తామని అన్నారట. కానీ దర్శకుడు కోరుకుంది చేయాలని అనడంతో.. తను షాకైన కూడా ఓకే అని.. అయితే అతడిని కూడా తాను చెప్పింది చేయమని వాళ్లతో కోరిందట. వెంటనే అతడిని బిల్డింగ్ మీద నుంచి దూకమని తనదైన శైలిలో సమాధానం ఇచ్చానని తెలిపింది శ్వేతా వర్మ. ఇక ఇలాంటి సమస్యలను ఆన్ లైన్, సోషల్ మీడియా ద్వారా తప్ప నేరుగా ఎదుర్కోలేదని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published: