Vishwak Sen: తెలుగు సినీ నటుడు విశ్వక్ సేన్. సిని నటుడుగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన అతి తక్కువ సమయంలో లో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. 2017 లో వెళ్ళిపోమాకే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఈ సినిమాతో ఉత్తమ తొలి నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత 2018లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కూడా ఉత్తమ నటుడి అవార్డును సొంతం. ఇక ఫలక్ నుమాదాస్ సినిమాకు దర్శకుడిగా చేశాడు. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ అసలు పేరు మరొకటి ఉందన్న విషయం చాలా వరకు తెలియదు. ఇంతకీ విశ్వక్ సేన్ మరో పేరు ఏంటంటే..
ప్రస్తుతం విశ్వక్ సేన్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. తాజాగా విశ్వక్ ఆలీతో సరదాగా అనే షో లో పాల్గొన్నాడు. ఇక ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇక అందులో విశ్వక్ ఎంట్రీతో ఆలీ దినేష్ నాయుడు అంటూ ప్రోగ్రాం కు స్వాగతం పలికాడు. ఇక ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉందట. ఈ పేరు పెట్టుకుంటే కష్ట పడతావని.. జీవితాంతం కష్ట పడతావు అని కానీ పేరు మాత్రం రాదని.. వాళ్ళ నాన్న అన్నాడట. అంతే కాకుండా ఇక కొన్ని విషయాలు అభిమానులతో పంచుకోగా.. ఇక ఈ ప్రోగ్రాం మే 3న ఈటీవీ లో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటె విశ్వక్ సేన్.. గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం అనే రెండు సినిమాలలో బిజీగా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paagal film, Real name, Tollywood hero, Vishwak Sen, Viswak sen, పాగల్, విశ్వక్ సేన్