OVERSEAS BOX OFFICE BREAKEVEN FOR VINAYA VIDHEYA RAMA NTR KATHANAYAKUDU F2 MOVIES
ఓవర్సీస్లో సంక్రాంతి సినిమాలు తుస్.. దూసుకుపోతున్న ‘ఎఫ్2’..
సంక్రాంతి 2019 సినిమాలు
సంక్రాంతికి రావాల్సిన నాలుగు సినిమాలు వచ్చేసాయి. జనవరి 9 నుంచి 12 వరకు వరసగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ నాలుగు భారీ సినిమాలే కావడంతో అంచనాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మరి వినయ విధేయ రామ, ఎఫ్2, కథానాయకుడు సినిమాలు అక్కడ సేఫ్ కావాలంటే ఎంత తీసుకురావాలి..?
సంక్రాంతికి రావాల్సిన నాలుగు సినిమాలు వచ్చేసాయి. జనవరి 9 నుంచి 12 వరకు వరసగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ నాలుగు భారీ సినిమాలే కావడంతో అంచనాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లుగా కలెక్షన్ల వేటలో ముందుంది. మిగిలిన మూడు సినిమాలు తుస్సుమనిపించేలా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రాలపై అంచనాలు భారీగానే ఉండటంతో.. హైయ్యస్ట్ రేట్లకు సినిమాను కొన్నారు అక్కడి బయ్యర్లు. మరి ఇవి ఇప్పుడు ఎంతవసూలు చేసాయి.. ఇంకా ఎంత తీసుకురావాలి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కథానయకుడిలో ఓ దృశ్యం (ట్విట్టర్)
ఎన్టీఆర్ కథానాయకుడు..
సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే భారీ రేట్ కు అమ్ముడైన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకుడు కావడం.. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. పైగా గౌతమీపుత్ర శాతకర్ణి ఓవర్సీస్ లో 1.8 మిలియన్ వసూలు చేయడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏకంగా 8 కోట్లకు కొనేసారు. అంటే ఇప్పుడు ఈ చిత్రం సేఫ్ కావాలంటే 2.1 మిలియన్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు అక్కడ కేవలం 6 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
వినయ విధేయ రామ
వినయ విధేయ రామ..
రంగస్థలం సినిమా ఏకంగా ఓవర్సీస్ లో 3.5 మిలియన్ వసూలు చేయడంతో బోయపాటికి అక్కడ మార్కెట్ లేకపోయినా కూడా చరణ్ ఉన్నాడనే ధైర్యంతో ఏకంగా 7 కోట్లకు పైగానే కొన్నారు. ఇప్పుడు ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 1.8 మిలియన్ వసూలు చేయాలి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం అక్కడ కనీసం హాఫ్ మిలియన్ కూడా దాటేలా కనిపించడం లేదు. దాంతో దారుణమైన ఫ్లాప్ ఖాయం అయిపోయింది. ఎందుకంటే బోయపాటి సినిమాలకు అక్కడ ఎప్పుడూ మార్కెట్ లేదు.
ఎఫ్2 వర్కింగ్ స్టిల్
ఎఫ్2.. ఫన్ అండ్ ప్రస్టేషన్..
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అక్కడ 3.8 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే ఇప్పుడు సినిమా సేఫ్ జోన్ కు రావాలంటే 1.2 మిలియన్ వసూలు చేయాలి. ప్రస్తుతానికి టాక్ బాగానే ఉన్నా కూడా ఇంత పోటీలో 1 మిలియన్ క్రాస్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ చిత్రం 3 లక్షల 50 డాలర్లు వసూలు చేసింది. కచ్చితంగా ఈ చిత్రం త్వరలోనే 1 మిలియన్ అందుకుంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.
‘పేట’లో రజినీకాంత్ (ట్విట్టర్ ఫోటో)
పేట..
తెలుగు సినిమా కాకపోయినా కూడా రజినీకాంత్ సినిమా కావడంతో పేటపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం సేఫ్ కావాలంటే ఓవర్సీస్లో ఏకంగా 2.5 మిలియన్ వసూలు చేయాలి. సినిమాకు టాక్ కూడా బాగానే రావడంతో కచ్చితంగా అంతా వసూలు చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట బాగానే వసూలు చేస్తుంది. ఇక విశ్వాసం సినిమా కూడా అక్కడ సేఫ్ అనిపించుకోవాలంటే 5 లక్షల డాలర్లు వసూలు చేయాలి. మరి వీటిలో ఏది చివరివరకు సేఫ్ జోన్ కు వస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.