Home /News /movies /

OTT UPDATE RRR ACHARYA AND BHALA THANDHANANA STREAMING ON 20TH MAY HERE ARE THE DETAILS SR

Telugu OTT Update : ఓటీటీలో ఒకే రోజు మూడు తెలుగు సినిమాలు.. మామూలుగా ఉండదు..

Telugu OTT Twitter

Telugu OTT Twitter

OTT Update : కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలు చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా.. విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీలోకి స్ట్రీమింగ్ వస్తున్నాయి. అందులో భాగంగా వచ్చే శుక్రవారం మూడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అందులో రెండు భారీ సినిమాలున్నాయి. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే  14 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను అందుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళీ, కన్నడ భాషాల్లో ఈ నెల 20 నుంచి జీ5 (Zee5 Premium) ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది అక్కడ. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు రెండు రోజులు ముందు విడుదలైతే.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న విడుదల కాబోతుంది. దీంతో మరోసారి తమ అభిమాన హీరో సినిమా చూడోచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  ఇక మరో సినిమా ఆచార్య(Acharya)... చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్‌(Ram Charan)లు కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌పై అనేక రూమర్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలకానుందో అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

  RRR Rajamouli Ram Charan Jr NTR Roudram Ranam Rudhiram OTT Trailer Released,RRR OTT Trailer : ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ విడుదల..,RRR OTT Trailer,RRR in Zee5 Premium, RRR Roudram Ranam Rudhiram ott, rrr in Dolby atoms, RRR controversy in Karnataka, RRR movie team massive promotions, RRR Bangalore Event, chief minister of Karnataka Basavaraj Bommai, Etthara Jenda Video Song, RRR news, RRR Imax Format, RRR Movie Review,RRR Screening, RRR Trailer, RRR digital rights acquired by netfilx, NTR Ram Charan Rajamouli, RRR third single janani, RRR songs, naatu naatu song, RRR Glimpse released, RRR new Release Date, కీరవాణీ, ఆర్ఆర్ఆర్ ట్రైలర్,ఆర్ఆర్ఆర్ ఐమాక్స్ ఫార్మాట్,ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్
  ఆర్ఆర్ఆర్ ఓటీటీ పోస్టర్ (Twitter/Photo)


  ఈ సినిమా మే 20న అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమింగ్‌కు రానుందని అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మరోసారి చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను ఓటీటీలో చూడోచ్చని సంబర పడిపోతున్నారు. రామ్ చరణ్ (Ram Charan)  సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్‌లు తీసుకున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

  Acharya OTT, Acharya OTT Steaming Date,Acharya Movie Amazon Prime, Chiranjeevi acharya news, Chiranjeevi Koratala siva acharya update, చిరంజీవి, ఆచార్య ఓటీటీ, ఆచార్య స్ట్రీమింగ్ డేట్
  Acharya OTT Streaming
  : Twitter


  ఇక మరోవైపు కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్‌కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు.  తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో  కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. పైగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చూడటంతో ఈ సినిమా చూడటానికి మొగ్గు చూపలేదు.  ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించాయి.  ఇక మరో సినిమా భళా తందనాన (Bhala Thandhanana).. ఈ సినిమా మే 20న హాట్ స్టార్‌(Disney Hotstar)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో యువ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్ర పోషించారు.


  శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. శ్రీ విష్ణు గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. తాజాగా ఈయన ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు వచ్చారు.  ఈ సినిమాను చైతన్య దంతలూరి డైరెక్ట్ చేసారు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్ఫణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ నటించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Acharya, Amazon prime, Bhala Thandhanana, Disney+ Hotstar, RRR, Tollywood news, Zee5

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు