• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • OTT PLATFORMS CENTRAL GOVERNMENT TO CONTEMPLATING SOME ACTION ON REGULATING OTT PLATFORMS SOON NK

OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు షాక్... కఠిన రూల్స్ తెచ్చే ఆలోచనలో కేంద్రం

OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు షాక్... కఠిన రూల్స్ తెచ్చే ఆలోచనలో కేంద్రం

OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు షాక్... కఠిన రూల్స్ తెచ్చే ఆలోచనలో కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)

OTT Platforms: సినిమాలకు సెన్సార్ ఉంది. తేడా వస్తే కత్తెర పడుతుంది. మరి ఓటీటీలకు అది సరిగా లేదు. ఇప్పుడు అక్కడ కూడా సెన్సార్ తెచ్చేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు తెలిసింది.

  • Share this:
    OTT Platforms: కరోనా లాక్‌డౌన్ సమయంలో... దేశ ప్రజలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు బాగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే... ఇప్పుడు థియేటర్లలో సినిమాలు రన్ అవుతున్నా... "నాల్రోజులు పోతే ఓటీటీలోకి వచ్చేస్తుందిగా... అప్పుడు చూద్దాంలే" అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు చాలామంది. ఐతే... ఈ మధ్య ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్‌లు హద్దులు మీరుతున్నాయనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో వాదన జరిగింది. తాము ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కొన్ని చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నామని (contemplating) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ లతో కూడిన త్రిసభ్య బెంచ్... ఓ పిటిషనర్ వేసిన పిల్‌పై విచారణ జరిపింది. పిల్ వేసిన వారు ఏం కోరారంటే... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపైనా నియంత్రణ ఉండాలనీ... ఇందుకోసం ఓ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశంపై పిటిషనర్... కేంద్ర ప్రభుత్వాన్నే కలవాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. అదే సమయంలో దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని 6 వారాల్లో చెప్పాలని ఆదేశించింది. దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై నియంత్రణ ఉండేలా కొన్ని చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తోందని చెప్పారు. ఈ వివరణతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. చర్యలంటే ఏంటి... ఏ చర్యలు తీసుకుంటారో 6 వారాల్లో చెప్పండి అని ఆదేశించింది.

    నిజానికి ఈ అంశంపై సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్ 15న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సమాచార ప్రసార శాఖ, ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నోటీసులు పంపింది. ఇప్పటికి కేంద్రం నుంచి అస్పష్ట సమాధానం వచ్చింది. ఈ పిల్ ని ఇద్దరు వేశారు. లాయర్ శశాంక్ శేఖర్ ఝా, లాయర్ అపూర్వ అహాతియా. డిజిటల్ మీడియాపై కచ్చితమైన కంట్రోల్ ఉండాలని వారు కోరారు.

    "దేశంలో సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించట్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఓటీటీ, స్ట్రీమింగ్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వారు తమ సినిమాలు, సిరీస్ లకు సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లతో పనిలేకుండా విడుదల చేసుకుంటున్నారు. ఐతే... ఈ డిజిటల్ కంటెంట్... పెద్ద మొత్తంలో ప్రజల చెంతకు చేరుతోంది. దీనిపై ఎలాంటి కంట్రోల్, ఫిల్టరింగ్, స్క్రీనింగ్ వంటివి జరగట్లేదు. కానీ ఇలాంటి కంటెంట్‌పై అభ్యంతరాలు చెబుతూ రోజూ చాలా మంది కేసులు ఫైల్ చేస్తున్నారు. దీనిపై కంట్రోల్ ఉండాలని ఎంతో మంది కోరుతున్న కేంద్రం ఆదిశగా చర్యలు తీసుకోవట్లేదు" అని పిల్‌లో కోరారు.

    ఇది కూడా చదవండి:Bhakti: వాస్తు ప్రకారం పూజ గది ఎలా ఉండాలి... ఏ కలర్ పెయింట్ వెయ్యాలి... తెలుసుకోండి

    కేంద్ర సమాచార శాఖ.... ఫిబ్రవరి 2020న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, హాట్‌స్టార్ వంటి సంస్థలు స్వయంగా నియంత్రణ విధించుకోవాలంటూ... ఓ నిబంధనల ఒప్పందాన్ని ఇచ్చింది. దానిపై ఏ సంస్థా సంతకం చెయ్యలేదు. అందువల్ల ఇప్పుడు కేంద్రం నియంత్రణ చర్యల దిశగా అడుగులు వేసేలా కనిపిస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని వేసి... గైడ్‌లైన్స్ రూపొందించనుందని తెలుస్తోంది. అదే జరిగితే... ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అడ్డమైన సీన్లకు కత్తెర తప్పదు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు